ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య భూతానికి పలు కారణాలను చెబుతోంది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం.
విద్యుత్ ఉత్పాదన:
విద్యుదుత్పత్తి కర్మాగారాల నుంచి వచ్చే వేడి.. భూతాపానికి ప్రధాన కారణం అవుతోంది. బొగ్గు, సహజవాయువులను మండించడం వల్ల ప్రపంచంలో చాలావరకు గ్రీన్‌హౌస్ ఉద్గారాలు వెలువడుతున్నాయి.
భవనాలు:
వాణిజ్య, నివాస భవనాలలో ఉపయోగించే ఇంధనం, ఏసీలు, అగ్నిమాపక పరికరాల వల్ల ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఫలితంగా దైనందిన జీవతంపై ప్రభావం పడుతోంది.
ఆహార వృథా
గ్రీన్‌హౌస్ ఉద్గారాలకు ఆహారవృథా ఒక కారణమే. పొలాల నుంచి బయటకు వచ్చే తరుణం నుంచి పంపిణీ నిల్వ, మార్కెట్లు, హోటళ్లు, వంటగదులు ఇలా అన్ని చోట్లా ఆహారం వృథా అవుతోంది.
ఇతర ఇంధనాలు
ఇంధనాలు, ఇతర ఉత్పత్తుల తయారీకి ముడిచమురు శుద్ధి, పైపులైన్ల లీకేజి వల్ల ముఖ్యంగా కొన్ని దేశాల్లో మీథేన్ లీకేజి వల్ల కూడా ఉద్గారాలు వస్తున్నాయి.
రవాణా
ట్రాఫిక్ జామ్‌లు, వాహనాల రద్దీ వల్లే కాక...విమానాలు, రైళ్లు, ఇలా రవాణాలో చల్లదనం కోసం వాడే వాహనాల వల్ల చాలావరకు గ్రీన్‌హౌస్ ఉద్గారాలు వెలువడుతున్నాయి. విద్యుత్ వాహనాలతో కొంత ప్రయోజనం ఉండొచ్చు.
వ్యవసాయం, భూమి
చెట్లను విచ్చలవిడిగా కొట్టేయడం...పశువుల వల్ల మొత్తం గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో అయిదోవంతు వెలువడుతున్నాయి. వ్యవసాయానికి, చేపలవేటకు ఉపయోగించే ఇంధనాలు, భూమి నుంచి వెలువడే ఉద్గారాలు అడవుల్లో మంటలూ గ్రీన్హౌస్పై ప్రభావం చూపుతోంది.
పరిశ్రమలు
ప్రపంచానికి కావల్సిన వస్తువుల ఉత్పత్తి వల్ల కూడా గ్రీన్‌హౌస్ వాయువులు వస్తున్నాయి. లోహాలు, రసాయనాలు, సిమెంటు, కాగితం, సెమీకండక్టర్ల ఉత్పత్తి వల్ల ఎక్కువ వాయువులు వెలువడుతున్నాయి. వీటి తయారీలో వెలువడే వ్యర్థాల కారణంగా సమస్య తీవ్రతరం అవుతోంది.
ఇదీ చూడండి: ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?