ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓ నివేదికపై అమెరికా తీవ్ర విమర్శలు - కరోనా మూలాలపై నివేదిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మంగళవారం విడుదల చేసిన నివేదికపై అమెరికా తీవ్ర విమర్శలు చేసింది. నివేదికలో ముఖ్య సమాచారం లోపించిందని తెలిపింది. చైనా పారదర్శకంగా వ్యవహరించట్లేదని ఆరోపించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO report on covid origin
డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Mar 31, 2021, 10:29 PM IST

కరోనా మూలాలు కనుగొనేందుకు మరింత సమయం అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం పేర్కొంది. అయితే చైనా పర్యటనకు సంబంధించి విడుదల చేసిన ఈ నివేదికపై అమెరికా సహా మిత్ర దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి. డబ్ల్యూహెచ్​ఓ నివేదికలో పారదర్శకత, ముఖ్య సమాచారం లోపించాయని శ్వేతసౌధం కార్యదర్శి జెన్ పాస్కీ విమర్శించారు.

"నివేదికలో ముఖ్య సమాచారం లోపించింది. అందులో కరోనా మూలాలపై ఆరు నెలల క్రితం మేము సేకరించిన సమాచారం తప్ప కొత్త విషయాలు లేవు. అందుకే మేము ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాము. చైనా పారదర్శకంగా వ్యవహరించట్లేదు. "

-జెన్​ పాస్కీ, శ్వేతసౌధం కార్యదర్శి

ఐరోపా సమాఖ్య కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. మూలాలు కనుగొనేందుకు తగిన సమాచారం లోపించిందని పేర్కొంది.

ప్రైవసీ..

పర్యటన సమయంలో తమ బృందం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని డబ్ల్యూహెచ్​ఓ బృందం అధ్యక్షుడు బెన్​ ఎంబెర్క్​ తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్నట్లుగానే సమాచారానికి సంబంధించి పలు ప్రైవసీ సమస్యలు తలెత్తాయని అన్నారు. అయితే తన నివేదికలో కీలక విషయాలను తొలగించాలంటూ తమకు ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొనడం గమనార్హం.

ఇదీ చదవండి : వెనక్కి తగ్గిన పాక్​- భారత దిగుమతులకు ఓకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.