ETV Bharat / international

ట్రంప్​ కోసం వ్యాక్సిన్ రూల్స్​కు వైట్​హౌస్​ బ్రేక్​!

కరోనా వ్యాక్సిన్ అనుమతికి సంబంధించి ఎఫ్​డీఏ కొత్త మార్గదర్శకాలను శ్వేతసౌధం నిలిపివేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ నవంబర్​ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లోపు కరోనా వ్యాక్సిన్​ను తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భావిస్తున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

White House
'వ్యాక్సిన్'పై​ ఎఫ్​డీఏ మార్గదర్శకాలకు శ్వేతసౌధం బ్రేకులు
author img

By

Published : Oct 6, 2020, 2:55 PM IST

కరోనా వ్యాక్సిన్​ను మార్కెట్​లోకి తెచ్చేందుకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేస్తూ ఎఫ్​డీఏ (ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​) రూపొందించిన కొత్త మార్గదర్శకాలను శ్వేతసౌధం నిలిపివేసింది. నవంబర్​ 3 లోపు కరోనా టీకాకు అనుమతి తీసుకోవాలని భావిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ నిర్ణయానికి అనుగుణంగా శ్వేతసౌధం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎఫ్​డీఏ మార్గదర్శకాలు...

వలంటీర్లపై రెెండు నెలలపాటు క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాలని ఎఫ్​డీఏ తెలిపింది. ఇలా చేస్తే ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్​లు ఉన్న తెలుస్తుందని, టీకా ఏ మేరకు కరోనా నుంచి కాపాడుతుందో తెలుస్తుందని ఎఫ్​డీఏ అభిప్రాయపడింది. అమెరికాలో ఆరుకు పైగా వ్యాక్సిన్​ క్యాండిడేట్లు ఈ క్లినికల్ ట్రయల్స్​ నిర్వహిస్తున్నాయి. అయితే వీటికి అత్యవసర అనుమతులు ఇవ్వడం తగదని ఎఫ్​డీఏ భావిస్తోంది.

సమర్థించుకున్న శ్వేతసౌధం...

అయితే వ్యాక్సిన్​ అనుమతి కోసం నూతన మార్గదర్శకాలు జారీ చేయడానికి ఎలాంటి కారణాలు లేవని శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు న్యూయార్క్​ టైమ్స్​ కథనం ప్రచురించింది.

ఎఫ్​డీఏ ఏమంది..?

వ్యాక్సిన్​ అనుమతిపై రాజకీయ నేతలు చేస్తోన్న ప్రకటనలపై ఎఫ్​డీఏ కమిషనర్​ స్టీఫెన్ హా ఘాటుగా స్పందించారు.

కరోనా వ్యాక్సిన్​కు అనుమతిపై నిర్ణయం తీసుకోవాల్సింది శాస్త్రవేత్తలు, రాజకీయ నేతలు కాదు. నిర్దిష్ట ప్రమాణాలకు కరోనా వ్యాక్సిన్​ క్యాండిడేట్లు చేరుకోవాలి. వ్యాక్సిన్​లు సురక్షితమని తేలాలి. ఓ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. కానీ తక్కువ వ్యవధిలో వ్యాక్సిన్​ తీసుకురావాలని శాస్త్రవేత్తలను పరుగులు పెట్టిస్తున్నారు. మాపై ఎలాంటి ఒత్తిడి చేసినా సహించేది లేదు. అందరికంటే అమెరికా ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం.

- స్టీఫెన్​ హా, ఎఫ్​డీఏ కమిషనర్

అయితే ఇటీవల కొన్ని కరోనా చికిత్సా విధానాలకు ఎఫ్​డీఏ అత్యవసర అనుమతులు ఇవ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలపై స్పందించిన ఎఫ్​డీఏ.. వ్యాక్సిన్​కు​ అనుమతులు కావాలంటే క్యాండిడేట్లు మరిన్ని ప్రమాణాలను ఎదుర్కోవాలని తేల్చిచెప్పింది.

ట్రంప్​ విశ్వాసం...

నవంబర్‌ కన్నా ముందే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు చెప్పారు.

"కరోనా వ్యాక్సిన్‌ పొందేందుకు చాలా దగ్గరకు చేరుకున్నాం. రానున్న కొన్ని వారాల్లోనే అది అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ మూడు, నాలుగు వారాల్లోపే రావచ్చు"

- డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

ఎన్నికలకు ముందే...

నవంబర్‌ మూడో తేదీన జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్‌ తీసుకురావడం కోసం ఎఫ్‌డీఏ మీద వైట్‌హౌస్​ ఒత్తిడి తెస్తోందనే విమర్శలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ఇప్పటికే శ్వేతసౌధం స్పష్టత ఇచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకు అనుమతి ఇవ్వమని ఎఫ్​డీఏ అంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.