ఎదుటివారిని మాస్క్ ధరించండి అని ఎలా చెప్తే బాగుంటుందో వివరిస్తున్నారు ఆబర్న్ విశ్వవిద్యాలయం నిపుణులు. మనకు పరిచయం లేని వ్యక్తులను మాస్కు ధరించండి అని చాలా తెలివిగా, మర్యాదపూర్వకంగా అడగాలి లేకుంటే వారు మారే అవకాశం తక్కువని అమెరికాలోని ఆబర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త జాన్ కవోకిజియాన్ అంటున్నారు.
ఒకవేళ మీరు ఏ దుకాణంలోనో, రెస్టారెంట్లోనో ఉంటే అక్కడ ఉన్న ఇంఛార్జికి మాస్కు ధరించని వ్యక్తి గురించి చెప్పాలి. మీరు ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు అవతలివారితో 'మనిద్దరి భద్రత కోసం మనం మాస్కులు ధరించి మాట్లాడుకుందాం.' అని తెలివిగా చెప్పాలని నిపుణులు అంటున్నారు.