ETV Bharat / international

'గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి' - ప్రపంచ ఆరోగ్య సంస్థ

గాలిలో ఉండే చిన్న చిన్న కణాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది ఓ శాస్త్రవేత్తల బృందం. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి సంబంధించిన సూచనలు, సిఫార్సులను సవరించాలని డబ్ల్యూహెచ్‌ఓకు సూచించింది.

Virus can transmit through air, a scientists group warns WHO
గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి!
author img

By

Published : Jul 6, 2020, 12:42 PM IST

Updated : Jul 6, 2020, 1:35 PM IST

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందా? రోగులకు దూరంగా ఉన్నా, తరచూ చేతులు శుభ్రం చేసుకున్నా... వైరస్ వ్యాప్తి ఆగదా? ఔననే అంటోంది తాజా పరిశోధన. గాలిలో ప్రయాణిస్తూ వైరస్ వ్యాపిస్తుందని సంచలన వాస్తవాన్ని వెల్లడించింది.

గాలిలో కరోనా వైరస్​ వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేకమార్లు తేల్చిచెప్పింది. అయితే డబ్ల్యూహెచ్​ఓ ప్రకటనలకు విరుద్ధంగా.. గాలిలో కూడా వైరస్​ వ్యాపిస్తుందని తాజాగా ఓ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. దీనిని రుజువు చేయడానికి తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది. ఇప్పుడు ఈ వార్త ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తోంది.

డబ్ల్యూహెచ్​ఓకు సూచనలు...

గాలిలో ఉండే చిన్న చిన్న కణాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఆధారాలున్నాయని ఓ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి సంబంధించిన సూచనలు, సిఫార్సులను సవరించాలని డబ్ల్యూహెచ్‌ఓకు సూచించింది. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఆధారాలతో సహా వచ్చే వారం ఓ ప్రముఖ జర్నల్‌లో ప్రచురించనున్నట్లు.. 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

కరోనా బాధితులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాలిలోని చిన్న కణాల్లోకి ప్రవేశించి.. ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఇందుకు భిన్నంగా డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం కేవలం బాధితుల తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని చెబుతున్న విషయం తెలిసిందే.

ఈ కథనంపై డబ్ల్యూహెచ్‌ఓ ఇంకా స్పందించాల్సి ఉంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటివరకు చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జూన్‌ 29న విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఇదే విషయాన్ని పునరావృతం చేసింది. వైద్య ప్రక్రియల అనంతరం వెలువడే ఐదు మైక్రాన్ల(ఒక మైక్రాన్ అంటే మీటర్‌లో పదిలక్షలో వంతు ) కంటే చిన్న కణాల ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. ఇది చాలా అరుదుగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని పరోక్షంగా చెప్పింది.

ఒకవేళ గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే ఆస్కారముందన్న శాస్త్రవేత్తల వాదనే నిజమైతే.. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కార్యాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు సహా గాలి, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కట్టడి సవాల్‌గా పరిణమించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాల వంటి ప్రాంతాల్లో గాలి అక్కడే చక్కర్లు కొట్టకుండా బలమైన ఫిల్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం రావొచ్చు.

Last Updated : Jul 6, 2020, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.