Virginia highway shuts down: అమెరికాలోని వర్జీనియాలో భారీగా కురిసిన మంచు రహదారులను కప్పేయడం వల్ల వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కరోలైన్ కౌంటీలోని 'ఇంటర్‌స్టేట్ 95' రహదారిపై 80 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సోమవారం రాత్రి మొత్తం వాహనదారులు రోడ్లపైనే ఉండిపోయారు. చిక్కుకుపోయిన వాహనదారులకు అవసరమైన సాయం చేస్తున్నామని రాష్ట్ర గవర్నర్ రాల్ఫ్ నార్తమ్ వెల్లడించారు. అయితే, పరిస్థితి పూర్తిగా ఎప్పుడు చక్కబడుతుందనేది చెప్పలేమని అన్నారు.
Virginia highway snow
భారీ ట్రక్కులు, కార్లు అన్నీ రహదారిపైనే ఆగిపోయాయి. నిలిచిపోయిన ట్రక్కులను బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు.
ఇదీ చదవండి: చైనాలో ప్రజల ఆకలి కేకలు- కఠిన లాక్డౌన్ వల్లే...