అమెరికా అందాల పోటీలో వర్జీనియాకు చెందిన జీవరసాయనవేత్త కెమెల్లి ష్రియర్ మెరిసింది. మిచిగాన్ సన్ ఎర్త్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించిన.. 'మిస్ అమెరికా' 2020 అందాల పోటీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది ష్రియర్.
తుది పోటీలో ల్యాబ్ కోట్లో వేదికపైకి వచ్చిన ష్రియర్.. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్ప్రేరకంతో రంగురంగుల రసాయన ప్రదర్శన ఇచ్చి అందరి మన్ననలు పొందింది. సుదీర్ఘంగా సాగిన పోటీలో విజేతగా నిలిచింది. 2019 మిస్ అమెరికా విజేత న్యూయార్క్‌కు చెందిన నియా ఫ్రాంక్లిన్.. ష్రియర్కు అందాల కిరీటాన్ని అలంకరించింది.
రెండో స్థానంలో మిస్ మిస్సౌరి సిమోన్ ఈస్టెర్, మూడో స్థానంలో మిస్ ఓక్లాహోం అడిసన్ ప్రైస్ నిలిచారు.
51 మంది పోటీ..
మిస్ అమెరికా పోటీల్లో 51 మంది యువతులు పోటీ పడ్డారు. విజేతకు 50 వేల డాలర్ల ఉపకార వేతనం అందిస్తారు.
ఇదీ చూడండి:ప్రపంచ సుందరిగా జమైకా యువతి.. రెండో రన్నరప్‌గా భారత్