కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా తమ వ్యాక్సిన్ 91 శాతం సామర్థ్యం కనబరుస్తోందని ఫైజర్ సంస్థ వెల్లడించింది. టీకా వేయించుకున్న తర్వాత ఆరు నెలల వరకూ దీని ప్రభావం ఉంటున్నట్టు తెలిపింది. వ్యాక్సిన్ నాణ్యతా పరీక్షల్లో భాగంగా 44 వేల మంది వలంటీర్లపై ఆ సంస్థ తాజాగా అధ్యయనం చేపట్టింది. తమ జర్మన్ భాగస్వామి బయోఎన్‌టెక్‌తో కలిసి గురువారం ఈ వివరాలను వెల్లడించింది.
"అధ్యయనంలో పాల్గొన్న వలంటీర్లలో మార్చి 13 నాటికి మొత్తం 927 మంది కొవిడ్ బారిన పడ్డారు. అయితే.. ఇందులో మా వ్యాక్సిన్ వేయించుకున్న 77 మంది, ఔషధ రహిత డమ్మీ టీకా తీసుకున్న మరో 850 మంది ఉన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఎలాంటి ప్రమాదకర లక్షణాలూ కనిపించలేదు. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగు చూసిన రకం కొవిడ్ వైరస్‌నూ ఇది సమర్థంగా నియంత్రించగలుగుతోంది."
-ఫైజర్ సంస్థ
ఫైజర్ వ్యాక్సిన్‌ను 16 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే అందించాలని తొలుత నిర్ణయించారు. అయితే.. 2,260 మంది చిన్నారులు పాల్గొన్న మరో అధ్యయనం ద్వారా 12 ఏళ్ల వయసు వారికి కూడా తమ వ్యాక్సిన్ సురక్షితమేనని తేలినట్టు ఫైజర్, బయోఎన్‌టెక్‌లు తెలిపాయి.
ఇదీ చూడండి:'టీకా అసమానతల'పై డబ్ల్యూటీఓ ఆందోళన