ETV Bharat / international

వ్యాక్సినేషన్ పూర్తైందా? బూస్టర్ డోసుకు సిద్ధమా? - booster shots

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల్లోనూ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. టీకా వల్ల వచ్చే రోగనిరోధక శక్తి ఎల్లకాలం ఉండే అవకాశం లేదు. దీనికి పరిష్కారంగానే బూస్టర్ డోసు అంశం తెరపైకి వచ్చింది. అయితే, బూస్టర్ డోసు ఎప్పుడు తీసుకోవాలి? దీనిపై నిపుణుల అభిప్రాయాలేంటి?

re vaccination
రీవ్యాక్సినేషన్
author img

By

Published : Aug 2, 2021, 3:29 PM IST

కరోనా వ్యాప్తి పెరిగినకొద్దీ కొత్త వేరియంట్లు(covid new variants) పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో వైరస్ కట్టడి కష్టమవుతోంది. ఇక.. టీకా తీసుకున్న వ్యక్తులకూ వైరస్ సోకుతోంది. ఫలితంగా వ్యాక్సిన్ రక్షణ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీకా ఇమ్యూనిటీతో వైరస్ నుంచి గట్టెక్కే అవకాశం లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపైనే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. బూస్టర్ డోసు ఆవశ్యకతపై అధ్యయనాలు చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన మైక్రోబయాలజిస్ట్, అంటు వ్యాధుల నిపుణుడు విలియం పెట్రి.. ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొన్నారు. బూస్టర్ డోసు(booster dose) అవసరమా? అయితే ఎప్పుడు, ఎవరికి ఇవ్వాలి అనే విషయాలపై స్పష్టత ఇచ్చారు.

1. బూస్టర్ డోసు అంటే ఏంటి(booster dose meaning)?

మానవ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది సర్వసాధారణం. టీకా ద్వారా లభించిన రోగనిరోధక శక్తి కూడా అంతే. కరోనా టీకానే కాదు ఇతర వ్యాక్సిన్లకూ ఇదే వర్తిస్తుంది. ఫ్లూ టీకా ఒక సంవత్సరం పాటు రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. డిఫ్తీరియా(కంఠరోహిణి), ధనుర్వాతం వంటి రోగాలకు ఇచ్చే టీకా పదేళ్ల వరకు రక్షణ కల్పిస్తుంది.

కరోనా విషయానికి వస్తే.. పలు అధ్యయనాల ప్రకారం కొవిడ్ టీకా కొన్ని నెలల వరకు సమర్థంగా వైరస్​ను అడ్డుకుంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా రోగ నిరోధక శక్తి కొనసాగేందుకే బూస్టర్ డోసులు(booster shots) ఉపయోగిస్తారు. టీకా డోసులు రెండూ తీసుకున్నవారికి అదనంగా ఇచ్చే డోసు ఇది.

ముందు ఇచ్చిన రెండు డోసుల టీకా వంటిదే బూస్టర్ డోసు. అయితే వైరస్​లోని మార్పులకు అనుగుణంగా బూస్టర్ డోసును సైతం కొన్నిసార్లు మరింత సమర్థంగా తయారు చేస్తారు. కొత్త మార్పులను అడ్డుకునే విధంగా రూపొందిస్తారు.

2. బూస్టర్ డోసును నియంత్రణ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయా?

అమెరికాలో నియంత్రణ సంస్థలు బూస్టర్ డోసుపై ఇప్పటివరకైతే ఎలాంటి సిఫార్సులు చేయలేదు. ఇజ్రాయెల్​లో మాత్రం 60 ఏళ్లు పైబడిన వారు మూడో డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్రాన్స్​లోనూ ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

3. బూస్టర్ డోసుపై ఎందుకు ముందుకు వెళ్లడం లేదు?

టీకా వల్ల లభించే రక్షణ 100 శాతం కాదు. కానీ, కరోనా విషయంలో ఈ రక్షణ ఎంతకాలం ఉంటుందనేది నిర్ధరణ కాలేదు. ముఖ్యంగా ఇప్పుడున్న టీకాలన్నీ మంచి ఇమ్యూనిటీనే అందిస్తున్నాయి. ఫైజర్ టీకా(Pfizer vaccine) తీసుకున్నవారిలో 12 వారాల తర్వాత కూడా 'బీ లింఫోసైట్ల'లో అధిక మెమొరీని గుర్తించారు. బీ లింఫోసైట్ల మెమొరీ.. వైరస్​కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది.

కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోయినా.. వైరస్ నుంచి కొన్ని టీకాలు రక్షణ కల్పిస్తున్నాయని ఇతర అధ్యయనాల్లో తేలింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా(Johnson & Johnson vaccine) బీటా వేరియంట్​పై 14 రోజుల తర్వాత 73 శాతం, 28 రోజుల తర్వాత 82 శాతం సమర్థత కనబర్చింది. ప్రాథమిక ఫలితాల్లో డెల్టా వేరియంట్​పై ఫైజర్ టీకా 88 శాతం మెరుగ్గా పనిచేసింది. ప్లాస్మోబ్లాస్ట్ కణాలలోనూ దీర్ఘకాల ఇమ్యూనిటీ కనిపించింది. ఈ కణాలతో పాటు యాంటీబాడీల ఉత్పత్తిలో పాల్గొనే ఇతర కణాలకు బూస్టర్ అవసరం లేదు.

4. బూస్టర్ డోసు ఎప్పుడు అవసరమవుతుందో తెలిసేదెలా?

బూస్టర్ డోసు తీసుకోవాలా అని టీకా తీసుకున్నవారిలో ఇప్పుడు చర్చ మొదలైంది. ప్రస్తుతానికైతే వ్యాక్సిన్లు సమర్థంగానే పనిచేస్తున్నాయి. అయితే, వ్యక్తిగత స్థాయిలో ఎంత ఇమ్యూనిటీ లభిస్తోందనేది తెలియాల్సి ఉంది. ఇందుకోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయం తేలేంత వరకు.. జనాభా అంతటికీ బూస్టర్ డోసు ఇచ్చే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

మరోవైపు, 80 ఏళ్లు పైబడిన వారిలో టీకా వల్ల వచ్చే యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతున్నాయి. సాధారణ జనాభాతో పోలిస్తే వీరిలో ఇమ్యూనిటీ త్వరగా తగ్గిపోతుంది. కొత్త వేరియంట్లు వీరిలోనే ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి వృద్ధులకు బూస్టర్ డోసు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి.

5. అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులకు బూస్టర్ డోసు అవసరమా?

అవయవ మార్పిడి జరిగిన వ్యక్తుల్లో సంబంధిత శరీర భాగంలో ఇమ్యూనిటీ వ్యవస్థను అణచివేస్తుంటారు. మార్పిడి చేసిన అవయవం తిరిగి జీవం సాధించేందుకు ఇలా చేస్తారు. ఇలాంటి వారిలో యాంటీబాడీల ఉత్పత్తి సరిగా జరగడం లేదు. ఓ అధ్యయనం ప్రకారం కిడ్నీ మార్పిడి చేయించుకున్న 40 మంది వ్యక్తుల్లో 39 మందికి టీకా తీసుకున్నప్పటికీ యాంటీబాడీల ఉత్పత్తి జరగలేదు. మస్క్యులోస్కెలిటల్ అనే వ్యాధి ఉన్న 20 మంది రోగులపై జరిపిన పరిశోధనలో సైతం ఇదే ఫలితాలు వచ్చాయి.

అయితే, ఇలాంటి రోగుల్లో టీకా ప్రభావం ఏమాత్రం లేదని నిర్ధరణకు వచ్చేయడం సరికాదు. ఓ అధ్యయనం ప్రకారం.. ఫైజర్, మోడెర్నా తీసుకున్న అవయవ మార్పిడి రోగుల్లో.. బూస్టర్ డోసు అందుకున్న తర్వాత యాంటీబాడీల ఉత్పత్తి జరిగింది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్​లోని నియంత్రణ సంస్థ ఇలాంటి రోగులకు బూస్టర్ డోసు ఇచ్చేందుకు సిఫార్సు చేసింది.

6. తొలిసారి తీసుకున్న టీకానే బూస్టర్ డోసుగా తీసుకోవాలా?

అలా ఏం కాదు. ఫైజర్, మోడెర్నా(Moderna) వంటి ఆర్​ఎన్ఏ టీకాల(mRNA vaccines)ను.. ఆస్ట్రాజెనెకా వంటి అడినోవైరస్ టీకాలతో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా.. టీకాల సమర్థతలో ఎలాంటి తేడా ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.