ETV Bharat / international

ప్రపంచానికి వ్యాక్సిన్ పంచనున్న అమెరికా!

author img

By

Published : Apr 27, 2021, 6:31 AM IST

సుమారు 6 కోట్ల ఆస్ట్రాజెనెకా టీకా డోసులను ప్రపంచానికి అందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. వ్యాక్సిన్ భద్రతపై సమీక్ష పూర్తయిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని శ్వేతసౌధం తెలిపింది.

AstraZeneca vaccine
ఆస్ట్రాజెనికా టీకా

తమ వద్దనున్న సుమారు 6 కోట్ల ఆస్ట్రాజెనెకా టీకా డోసులను ప్రపంచానికి పంచాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. వ్యాక్సిన్ భద్రతపై సమీక్ష పూర్తయిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని శ్వేతసౌధం తెలిపింది.

ఆస్ట్రాజెనెకా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్.. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది. అయితే దీన్ని అమెరికా ఆహార, ఔషధ సంస్థ(ఎఫ్​డీఏ) ఇప్పటికీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ క్రమంలో మెక్సికో, కెనడాలకు 40 లక్షల టీకా డోసులను అమెరికా అందించింది.

" మా దగ్గర ఉన్న వ్యాక్సిన్లలో ఆస్ట్రాజెనెకా టీకాకు ఇంకా ఎఫ్​డీఐ ధ్రువీకరణ రాలేదు. దీంతో దేశంలో కొన్ని నెలల క్రితం పాటు దీన్ని ఉపయోగించే అవసరం ఉండదు. మా వద్దనున్న ఆ టీకాలను ప్రపంచ దేశాలకు ఇవ్వాలని భావిస్తున్నాం."

-- జెఫ్ జియంట్స్, శ్వేతసౌధం కొవిడ్​-19 సమన్వయ కర్త

జాన్సన్​ సింగిల్ డోసు సహా మొత్తం మూడు రకాల వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతామని శ్వేతసౌధం ఇటీవల వెల్లడించిన క్రమంలోనే ఈ తాజా ప్రకటన వెలువడటం విశేషం.

ఇదీ చదవండి : 'కశ్మీర్​కు ప్రత్యేక హోదాపై పునరాలోచన చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.