అమెరికాను బాంబ్ తుపాను వణికిస్తోంది. వేగంగా వీస్తున్న గాలులు అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మంచు సెంటీమీటర్ల మేర పేరుకుపోయింది. రవాణా, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. అనేక విమానసర్వీసులు రద్దయ్యాయి.
దక్షిణ డకోటాలో 45 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. హిమాన్ని తొలగించడానికి సిబ్బంది శ్రమిస్తున్నారు. మిన్నెసొటా, నెబ్రాస్కా, దక్షిణ డకోటాలో పాఠశాలలకు రెండోరోజూ సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలూ కార్యకలాపాలకు నోచుకోలేదు.