ETV Bharat / international

అమెరికా విదేశాంగ మంత్రిగా బ్లింకెన్​-సెనెట్​ ఆమోదం - ఆంటోని బ్లింకెన్​ సెనేట్​ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. కేబినెట్​లో మరో సభ్యుడిని సెనెట్​ ధ్రువీకరించింది. ​ఆ దేశ విదేశాంగ మంత్రిగా ఆంటోని బ్లింకెన్​కు 78-22 ఓట్ల తేడాతో సెనెటర్లు ఆమోదం తెలిపారు.

america new secretary of state
అమెరికా విదేశాంగ మంత్రిగా బ్లింకెన్​- సెనేట్​ ఆమోదం
author img

By

Published : Jan 27, 2021, 9:47 AM IST

Updated : Jan 27, 2021, 11:49 AM IST

అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా.. ఆంటోని బ్లింకెన్​ ​నియామకాన్నిసెనెట్​ ఆమోదించింది. సెనెట్​లో​ 78 మంది సభ్యులు ఆయనకు మద్దతు తెలిపారు. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒబామా హయాంలో బ్లింకెన్.. జాతీయ భద్రతా దళంలో ఉన్నత స్థాయి అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. అధ్యక్షుడు జో బైడెన్​ కేబినెట్​లో ఇప్పటివరకు సెనెట్​ ఆమోదించిన నాలుగో వ్యక్తిగా బ్లింకెన్​ నిలిచారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

బ్లింకెన్​ ఎన్నికపై సెనెట్​ మెజారిటీ నేత చుక్​ షుమర్​ హర్షం వ్యక్తం చేశారు. వివిధ దేశాలతో అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో బ్లింకెన్​ ముఖ్య పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. బ్లింకెన్​ నియామకం పట్ల పలువురు సెనెటర్లు సంతోషం వ్యక్తం చేశారు.

నూతన యంత్రాంగంతో భారత్​-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని గత వారం ఆంటోని బ్లింకెన్​ పేర్కొన్నారు. ట్రంప్​ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇండో-పసిఫిక్​ వ్యూహానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

ఇదీ చూడండి:బైడెన్​ బృందంలో మరో నలుగురు భారతీయులు

Last Updated : Jan 27, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.