అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని జె బ్లింకెన్.. ఈనెల 27, 28 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానుండటం ఇదే మొదటిసారి.
ఈ పర్యటనలో ఆంటోని బ్లింకెన్.. ప్రధాని నరేంద్రమోదీతోపాటు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో భేటీ కానున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు బ్లింకెన్ భారత పర్యటన దోహదం చేస్తుందని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా నివారణ చర్యలు, ఇండో- పసిఫిక్ ప్రాంతీయ అంశాలు, అఫ్ఘానిస్థాన్‌లో తాజా పరిస్థితి, ఇతర అంశాలపై చర్చలు జరపనున్నట్లు పేర్కొంది.
ఇవీ చదవండి:అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో జిన్‌పింగ్ అనూహ్య పర్యటన