ETV Bharat / international

చైనా, హాంకాంగ్ అధికారులపై అమెరికా ఆంక్షలు - చైనాపై అమెరికా ఆంక్షలు

అమెరికా విదేశాంగ శాఖ.. చైనా, హాంకాంగ్​కు చెందిన 24 మంది అధికారులపై ఆంక్షలు విధించింది. హాంకాంగ్​ ఎన్నికల వ్యవస్థను చైనా అస్తవ్యస్తం చేయాలని ప్రయత్నిస్తోందని అగ్రరాజ్యం ఆరోపించింది. ఆంక్షలు విధించాలన్న నిర్ణయం చైనా వైఖరిపై తమ వ్యతిరేకత తెలియజేస్తుందని పేర్కొంది.

america
చైనా, హాంకాంగ్ అధికారులపై అమెరికా ఆంక్షలు
author img

By

Published : Mar 17, 2021, 1:25 PM IST

చైనా, హాంకాంగ్​కు చెందిన మరో 24 మంది అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. హాంకాంగ్​ స్వయంప్రతిపత్తి చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది.

ఆంక్షలు ఎదుర్కొన్న వారిలో చైనా ఉన్నతాధికారులు ఉండటం గమనార్హం. హాంకాంగ్​ ప్రతినిధి, చైనాకు మద్దతుదారైన తామ్ యు చంగ్​ సహా చైనా కమ్యూనిస్ట్​ పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యుడిపై ఆంక్షలు విధించారు. హాంకాంగ్​ జాతీయ భద్రత విభాగానికి చెందిన పలువురు అధికారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

"ఈ నిర్ణయం చైనా వైఖరిపై మా వ్యతిరేకతను తెలిజేస్తుంది. హాంకాంగ్​ ఎన్నికల వ్యవస్థను చైనా అస్తవ్యస్తం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి మార్చి 11న ఆ దేశం తీసుకున్న నిర్ణయమే అందుకు ఉదాహరణ. ఇదే కొనసాగితే హాంకాంగ్​ స్వతంత్రత కోల్పోడమే కాకుండా, ఆ దేశస్థులు తమ హక్కులను కోల్పోతారు."

-టోనీ బ్లింకన్, అమెరికా విదేశాంగ మంత్రి

ఎన్నికల చట్టానికి చైనా చేసిన సవరణ ద్వారా ఆ దేశానికి హాంకాంగ్​లో ప్రజాప్రతినిధులను నియమించే అధికారం మరింత పెరగనుంది. దీని ద్వారా హాంకాంగ్​ పౌరులకు నేరుగా ఎన్నికయ్యే అవకాశాలు తగ్గుతాయి.

గతేడాది అక్టోబరులోనూ అమెరికా ఇదే విధంగా 10 మంది అధికారులపై ఆంక్షలు విధించింది.

ఇదీ చదవండి : దయచేసి టీకా తీసుకోండి: ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.