ETV Bharat / international

అమెరికాలో కరోనా వైరస్​ కొత్త రికార్డులు

author img

By

Published : Nov 5, 2020, 9:56 AM IST

అమెరికాలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. రెండ్రోజుల్లో లక్షా 91 వేల మందికి పైగా వైరస్​ బారిన పడ్డారు. దేశంలో ఇప్పటివరకు 98 లక్షల మందికి వైరస్ సోకగా.. 2.39 లక్షలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

US reports
అమెరికా

అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న వేళ కరోనా మహమ్మారి విజృంభించింది. వరుసగా రెండోరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఎన్నికల రోజున 91 వేల కేసులు రాగా.. నవంబర్​ 4న 1.08 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన రెండు వారాల్లో కరోనా కేసుల్లో 45 శాతం పెరుగుదల నమోదైంది.

తాజా కేసులతో కలిపి అమెరికాలో సుమారు 98 లక్షల మందికి వైరస్ సోకింది. ఇందులో 2.39 లక్షల మందికి పైగా మరణించారు. శీతకాలం నేపథ్యంలో వైరస్ వ్యాప్తి అధికమైందని నిపుణులు భావిస్తున్నారు.

ఉల్లంఘనలే కారణం..

దేశంలో ఇండోర్​ కార్యక్రమాలు పెరగటం, కొవిడ్-19 మార్గదర్శకాల ఉల్లంఘనలే కేసుల పెరుగుదలకు కారణమైందని వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) వెల్లడించింది. కరోనా బారిన వ్యక్తులనూ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించడం ఇందుకు మరో కారణమని తెలిపింది.

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం జనవరి 20న ముగుస్తుంది. ఈ 3 నెలల కాలంలో సుమారు లక్ష మందికిపైగా కరోనా ధాటికి మరణించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: వారిలో నెలలపాటు యాంటీబాడీల వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.