ETV Bharat / international

భారత్​కు అమెరికా 216 బిలియన్​ డాలర్ల బాకీ - భారత్​కు అమెరికా బాకీ

అమెరికా భారత్​కు 216 బిలియన్​ డాలర్లు బాకీ ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ చట్టసభ్యలు, రిపబ్లికన్​ పార్టీ నేత అలెక్స్ మూనీ వెల్లడించారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ పరిస్థితి నుంచి బయటపడే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఉద్దీపన​ ప్యాకేజీని మూనీ సహా పలువురు చట్టసభ్యులు వ్యతిరేకించారు.

america, india
భారత్​కు అగ్రరాజ్యం 216 బిలియన్​ డాలర్లు బాకీ!
author img

By

Published : Feb 27, 2021, 12:23 PM IST

ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో ప్రత్యేక స్థానం ఉన్న అమెరికా.. అభివృద్ధి దశలో ఉన్న భారత్​కు అప్పు ఉంది. ఆర్థిక అవసరాల కోసం వివిధ దేశాల వద్ద అప్పులు చేసిన అమెరికా, భారత్​కు 216 బిలియన్ డాలర్లు బాకీ ఉంది. ఈ విషయాన్ని రిపబ్లికన్​ పార్టీ చట్టసభ్యుడు అలెక్స్​ మూనీ వెల్లడించారు. అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు అమెరికా 27.9 ట్రిలియన్​ డాలర్లు బాకీ ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీని వ్యతిరేకిస్తూ మూనీ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఒబామా ఎనిమిదేళ్ల కాలంలో అప్పులు రెండింతలు అయ్యాయి. దీంతో ప్రస్తుతం పరిస్థితి చేజారే స్థితికి చేరుకుంది. కాబట్టి ప్యాకేజీపై నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచించండి. జపాన్​, చైనాలకు ఒక్కో ట్రిలియన్​ డాలర్ల చొప్పున బాకీ ఉన్నాము. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. పరిస్థితి కూడా అదుపు తప్పింది. సగటున ఒక్కో అమెరికన్​ 84వేల డాలర్లకు పైగా బాకీ ఉన్నాడు."

-అలెక్స్​ మూనీ, చట్టసభ్యుడు

2000వ సంవత్సరం నాటికి అమెరికా అప్పు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం ఉన్న అప్పుల వ్యయం ప్రకారం 2050 నాటికి అమెరికా బాకీ.. 104 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందనేది కాంగ్రెషనల్ బడ్జెట్​ ఆఫీస్​ అంచనా.

ఇదీ చదవండి : 'అమెరికన్ల జోలికి వస్తే ఊరుకోం'- ఇరాన్​కు బైడెన్ వార్నింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.