అమెరికా నౌకాదళం భారత్ కోసం హిందీ పాట ఆలపించింది. యూఎస్ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (సీఎన్ఓ) మైఖేల్ గిల్డే, అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు శనివారం ఓ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందీ పాటను పాడి అతిథులను సంతోషపరిచింది యూఎస్ నేవీ బ్యాండ్.
ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు సంధు. "భారత్, అమెరికా మైత్రి ఎన్నటికీ విడదీయరానిది" అని పేర్కొన్నారు.
-
'ये वो बंधन है जो कभी टूट नहीं सकता! This is a friendship bond that cannot be broken ever.' 🇮🇳🇺🇸
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) March 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
US Navy singing a popular Hindi tune @USNavyCNO 's dinner last night! pic.twitter.com/hfzXsg0cAr
">'ये वो बंधन है जो कभी टूट नहीं सकता! This is a friendship bond that cannot be broken ever.' 🇮🇳🇺🇸
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) March 27, 2021
US Navy singing a popular Hindi tune @USNavyCNO 's dinner last night! pic.twitter.com/hfzXsg0cAr'ये वो बंधन है जो कभी टूट नहीं सकता! This is a friendship bond that cannot be broken ever.' 🇮🇳🇺🇸
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) March 27, 2021
US Navy singing a popular Hindi tune @USNavyCNO 's dinner last night! pic.twitter.com/hfzXsg0cAr
2004లో హిందీలో వచ్చిన 'స్వదేశ్' చిత్రంలోని 'యే జో దేశ్ హై తేరా' పాటను పాడింది నేవీ బ్యాండ్. సినిమాలో ఆ పాటను ఏఆర్ రెహమాన్ స్వయంగా పాడటమే కాక స్వరాలు సమకూర్చారు. ఈ వీడియోకు 196వేల మంది చూశారు. 15 లక్షల మంది లైక్ చేశారు.
"అమెరికా చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ మైఖేల్ ఎం గిల్డే, భారత రాయబారి సంధు తరణ్‌జీత్ సింగ్ కోసం ప్రేమ, ఆనందంతో నౌకదళ బ్యాండ్ చిన్న ప్రదర్శన చేసింది. ఈ బ్యాండ్ 1925 నుంచి భాగస్వామ్య దేశాలతో అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు."
- యూఎస్ నేవీ బ్యాండ్
"ఇండో పసిఫిక్ సహా మిగిలిన ప్రాంతాల్లోనూ స్వేచ్ఛ, పారదర్శక నిబంధనల ఆధారిత వాణిజ్య ప్రోత్సహకానికి భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇరు దేశాల నేవీ ఇలాగే పరస్పర సహకారం అందించుకోవాలని ఆశిస్తున్నా" అని గిల్డే అన్నారు.
ఇదీ చూడండి: అమెరికాలో వరద బీభత్సం- నలుగురు మృతి