ETV Bharat / international

భారత్‌కు సాయంగా అమెరికా నుంచి 'మెర్సీషిప్‌'

కొవిడ్ కట్టడిలో భాగంగా... భారత్​లో వైద్యసహాయం అందించేందుకు అమెరికా ఓ మెర్సీషిప్​ను పంపించనుంది. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ సభ్యురాలు షీలా జాక్సన్‌ లీ ట్వి'ట్టర్‌లో పేర్కొన్నారు. భారత్​కు అన్ని విధాలా సాయం చేసేందుకు కలిసి పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు.

sheila jackson
షీలా జాక్సన్ లీ
author img

By

Published : May 6, 2021, 5:39 PM IST

కొవిడ్‌ సంక్షోభంలో భారత్‌లో వైద్యసహాయం అందించేందుకు అమెరికా ఓ మెర్సీషిప్‌ను పంపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ సభ్యురాలు షీలా జాక్సన్‌ లీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. "భారత్​కు మానవతా సాయం ప్రకటించాము. ఓ మెర్సీషిప్‌ను పంపించాలని ప్రతిపాదించాము. భారత్‌లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ఆ దేశానికి అన్ని విధాలా సాయం చేసేందుకు మేం కలిసి పనిచేస్తాం" అని ఆమె ట్వీట్‌ చేశారు. షీలా జాక్సన్‌ బుధవారం హూస్టన్‌లోని 'ది యునైటెడ్‌ మెమోరియల్‌ మెడికల్‌ సెంటర్‌' నుంచి భారత్‌కు అవసరమైన సహాయ పరికరాలు పంపే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

  • Today, we announced humanitarian help to India and proposed travel of a mercy ship to India to help with the devastation of Covid-19. The situation in India is dire so we must organize and collaborate to provide the aide India needs. Thank you @cgihou, @HoustonUmmc, and leaders! pic.twitter.com/cZUVyc6q8G

    — Sheila Jackson Lee (@JacksonLeeTX18) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమెరికా కాంగ్రెస్‌ వుమెన్‌ కేథరిన్‌ క్లార్క్‌ మాట్లాడుతూ "భారత్‌లో సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా సాధ్యమైనంత వరకు కృషి చేయాలి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ బారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా పనిచేయాలి" అని తెలిపారు.

ఇండో-అమెరికన్‌ కాంగ్రెస్‌మెన్‌ రాజా కృష్ణమూర్తి బుధవారం అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధుతో భేటీ అయ్యారు. అనంతరం తరణ్‌జీత్‌ సింగ్‌ సంధు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ''ఈ కష్టకాలంలో భారత్‌కు అండగా ఉన్న కాంగ్రెస్‌ సభ్యుడికి ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో..

ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో భారత్‌ సాయం పంపినట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా పంపిన వాటిల్లో 10లక్షల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, 545 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 16లక్షల ఎన్‌95 మాస్క్‌లు, 457 ఆక్సిజన్‌ సిలిండర్లు, 440 రెగ్యులేటర్లు, 220 పల్స్‌ ఆక్సిమీటర్లు, ఒక డెప్లాయిబుల్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేషన్‌ వ్యవస్థ ఉన్నాయి.

ఇదీ చదవండి:మనోళ్లు భారత్​ను చూసి నేర్చుకోవాలి: పాక్ ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.