ETV Bharat / international

అధ్యక్ష పోరు: ఓటేసేందుకు బారులుతీరిన అమెరికన్లు - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, మెయిన్, న్యూజెర్సీ,న్యూయార్క్, వర్జీనియా రాష్ట్రాల్లో పోలింగ్​ కేంద్రాలు ఓటర్లతో నిండిపోయాయి. ఇప్పటికే దాదాపు 10 కోట్ల మంది అమెరికన్లు ముందస్తు ఓటింగ్​లో పాల్గొనగా.. మరో 6 కోట్ల మంది ఇవాళ ఓటు వేయనున్నారు.

america election news
అమెరికా ఎన్నికలు: ఓటేసేందుకు బారులుతీరిన జనం
author img

By

Published : Nov 3, 2020, 7:52 PM IST

Updated : Nov 3, 2020, 10:44 PM IST

యావత్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ మొదలైంది. అక్కడి కాలమానం ప్రకారం నవంబరు 3 ఉదయం 6 గంటలకు న్యూయార్క్‌, న్యూజెర్సీ, వర్జీనియాలో పోలింగ్‌ను ప్రారంభించారు. డెలావెర్, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, లూసియానా, మిషిగన్, మిస్సోరి, పెన్సిల్వేనియా, రోడ్ ఐలండ్, సౌత్ కెరోలైనా రాష్ట్రాలలో ఐదున్నర గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అమెరికా తలరాతను నిర్ణయించే ప్రతిష్ఠాత్మక ఎన్నికలు కావడం వల్ల ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రజలు భారీగానే తరలివస్తున్నారు. పెన్సిల్వేనియా భారీ ఓటింగ్​ దిశగా దూసుకెళ్తోందని అధికారులు వెల్లడించారు.

ఓటేసేందుకు బారులుతీరిన అమెరికన్లు

ముందస్తు ఓటింగ్​...

అమెరికన్లకు ఎన్నికల రోజునే కాకుండా ముందే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దాన్ని ఎర్లీ ఓటింగ్‌గా పిలుస్తారు. కొవిడ్‌ భయంతో ఈసారి చాలా మంది ముందస్తు ఓటింగ్‌కే వెళ్లారు. ఇప్పటికే దాదాపు 10 కోట్ల మంది అమెరికన్లు ముందస్తు ఓటు వేశారు. మరో 6 కోట్ల మంది వరకూ ప్రత్యక్షంగా ఇవాళ ఓటు వేసే అవకాశముంది.

అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది అర్హులైన ఓటర్లున్నారు. 2016 ఎన్నికలతో పోల్చితే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. హవాయ్, టెక్సాస్, మాంటానా రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్​.. 2016 రికార్డులను మించిపోయింది. నార్త్ కరోలినా, జార్జియా, న్యూమెక్సికో, నెవాడా, టెన్నెసీ వంటి రాష్ట్రాల్లోనూ భారీగానే ఓట్లు పోలయ్యాయి.

america election news
రక్షణగా ఏర్పాట్లు చేసుకున్న దుకాణదారులు

రక్షణ ఏర్పాట్లు ...

అధ్యక్ష ఎన్నికల ఓటింగ్​ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అమెరికా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా న్యూయార్క్​లోని పలు వీధుల్లో వ్యాపారులు తమ దుకాణాలకు చెక్కలను అడ్డుపెట్టుకున్నారు. ఆందోళనలు జరిగితే తమ భవనాలు ధ్వంసం కాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వైట్​ హౌస్​ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలర్లు చెలరేగితే అణిచివేసేందుకు నేషనల్​ గార్డ్స్​కు చెందిన 600 బృందాలను మోహరించారు.

ఫలితాలు ఆలస్యమే...

కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది ప్రత్యక్షంగా ఓటు వేయడం కన్నా మెయిల్​ ఇన్​ బ్యాలెట్ల వైపు మొగ్గుచూపారు. భారీగా మెయిల్​ బ్యాలెట్లు ఉండటం, వాటిని లెక్కింపు కేంద్రాలకు చేర్చేందుకు వారాల సమయం పట్టనున్న నేపథ్యంలో.. ఎప్పటిలా ఫలితాలు పోలింగ్​ ముగిసిన రోజు ప్రకటించరు.

Last Updated : Nov 3, 2020, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.