ETV Bharat / international

హెచ్‌ 1బీ వీసా ఆంక్షలపై ట్రంప్​కు చుక్కెదురు

హెచ్​-1బీ వీసాల అంక్షలపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. కొద్ది రోజుల క్రితం విధించిన ఆంక్షలను కొట్టివేసింది కాలిఫోర్నియా కోర్టు. కొత్త నిబంధనల అమలుకు ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేదని అభిప్రాయపడ్డారు ఈ కేసును విచారించిన న్యాయమూర్తి. తమ వాదనను ట్రంప్​ ప్రభుత్వం నిరూపించుకోలేకపోయిందని స్పష్టం చేశారు.

H1B visas
హెచ్‌ 1బీ 'వీసా'వహులకు ఊరట
author img

By

Published : Dec 2, 2020, 12:14 PM IST

అగ్రరాజ్యంలో వలసలు, నిరుద్యోగాన్ని అదుపులో పెట్టేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న వీసా నిర్ణయాలకు కాలిఫోర్నియా సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. విదేశీ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన హెచ్‌ 1బీ వీసాలపై అధ్యక్షుడు విధించిన ఆంక్షలను ఇక్కడి న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నిబంధనల అమలుకు ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ట్రంప్‌ ప్రభుత్వం తగినంత సమయం కేటాయించలేదని.. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జెఫ్రీ వైట్‌ వెల్లడించారు. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకంటూ విదేశీ నిపుణులకు కూడా స్థానికులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే నిబంధన విధించటంతో వాణిజ్య సంస్థలు ఇరుకున పడ్డాయని న్యాయమూర్తి తెలిపారు.

కొవిడ్‌-19 వల్ల ఉద్యోగాల సంఖ్యపై కోత పడిందని.. తద్వారా నిరుద్యోగం తీవ్రమయ్యే ప్రమాదముందని ట్రంప్‌ ప్రభుత్వం వాదించింది. దీని నుంచి తప్పించుకొనేందుకు అంటూ ఈ సంవత్సరాంతం వరకు హెచ్‌ 1బీ, ఇతర విదేశీ వీసాలను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో వీసా దరఖాస్తుల సంఖ్య మూడో వంతుకు పడిపోతుందని ఆశించారు. అయితే ఈ వాదనను ట్రంప్‌ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, నిపుణులైన ఉద్యోగుల అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందని పిటిషన్‌ వేసిన ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరర్స్‌’ ప్రతినిధులు వెల్లడించారు. ట్రంప్‌ నిర్ణయంతో దేశంలోని కీలక రంగాలు సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. కాగా, ఈ తీర్పుతో అమెరికాలోని వ్యాపార వర్గాలకు విజయం చేకూరినట్టు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: 'నా బృందంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.