ETV Bharat / international

చైనా భద్రతా చట్టంపై చర్చించాలని ఐరాసకు అమెరికా పిలుపు

హాంకాంగ్​లో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతా మండలికి పిలుపునిచ్చింది అమెరికా. హాంకాంగ్​ స్వయం ప్రతిపత్తిని హరించే చైనా జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు సమావేశం కావాలని కోరింది. చైనా భద్రతా చట్టం... 1997 నాటి బ్రిటిష్ ఒప్పందానికి విరుద్ధమని అగ్రరాజ్యం పేర్కొంది.

US calls for UN Security Council meeting on Hong Kong
చైనా భద్రత చట్టంపై చర్చకు ఐరాసకు అమెరికా పిలుపు
author img

By

Published : May 28, 2020, 11:26 AM IST

హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని హరించే చైనా జాతీయ భద్రతా చట్టంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి(ఐరాస) భద్రతా మండలి సమావేశం కావాలని అమెరికా పిలుపునిచ్చింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ చట్టంపై సభ్య దేశాలు చర్చించాల్సిన అవసరం ఉందని అమెరికా స్పష్టం చేసింది.

విరుద్ధం..

హాంకాంగ్‌లో వేర్పాటు వాదం, విధ్వంసం, విదేశీ జోక్యాన్ని నిషేధిస్తూ చైనా ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్‌లో ఈ నెల 22న జాతీయ భద్రతా బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లోని ప్రజాస్వామ్య అనుకూల వాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 1997 నాటి బ్రిటిష్ ఒప్పందానికి ఈ బిల్లు విరుద్ధమని నినదించారు.

ఆ సమయంలోనే కొన్ని రక్షణలు

బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న హాంకాంగ్‌కు... చైనా పాలన కిందకు వచ్చే సమయంలో కొన్ని రక్షణలు కల్పించారు. చైనా ప్రధాన భూభాగంలో లేనటువంటి ప్రజాస్వామ్య హక్కులను హాంకాంగ్ పౌరులకు అందించారు. ఇప్పుడా హక్కులను పరిమితం చేస్తూ చైనా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టంపై చర్చించాలని భద్రతా మండలిలో అమెరికా పట్టుపడుతోంది.

ఇదీ చూడండి: కల్తీ మద్యం తాగి 16 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.