అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు రాబర్ట్ ఓబ్రయన్కు కరోనా సోకింది. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో వైరస్ బారినపడ్డవారిలో ఈయనే అత్యున్నతస్థాయి అధికారి.
ఓబ్రయన్ రాబర్ట్ సురక్షిత ప్రాంతంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపిన శ్వేతసౌధం.. ఆయన అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారని పేర్కొంది. కరోనా స్వల్ప లక్షణాలున్న రాబర్ట్‌ను ఇటీవలి కాలంలో ట్రంప్ కలవలేదని.. ఫలితంగా ఆయన క్షేమంగా ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. జాతీయ భద్రతా మండలిని కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
ఇదీ చదవండి: 30వేల మందితో అతిపెద్ద వ్యాక్సిన్ ప్రయోగం