ETV Bharat / international

డా.ఫౌచీని ఉద్యోగం నుంచి తీసేస్తా: ట్రంప్

కరోనా కట్టడి విషయంలో అంటువ్యాధుల నిపుణుడు డా. ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు అధ్యక్షుడు ట్రంప్. ఎన్నికల అనంతరం డా. ఫౌచీని ఉద్యోగం నుంచి తొలగిస్తానని వ్యాఖ్యానించారు.

fauci_trump
డా. ఫౌచీ వ్యాఖ్యలపై మండిపడ్డ ట్రంప్
author img

By

Published : Nov 2, 2020, 3:03 PM IST

అమెరికా ఎన్నికల అనంతరం ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. ఆంటోనీ ఫౌచీని ఉద్యోగం నుంచి తొలగిస్తానని చెప్పారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. ఫ్లోరిడాలోని ఒపా-లాఖాలో నిర్వహించిన ర్యాలీలో భాగంగా ఫౌచీపై మండిపడ్డారు ట్రంప్. అదే సమయంలో ఆయన మద్దతుదారులు ​'ఫైర్​ ఫౌచీ' (ఫౌచీని తొలగించాలి) అని నినాదాలు చేశారు.

ట్రంప్​ ఆగ్రహానికి కారణం?

కరోనా కట్టడి విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వైఖరిని తప్పుబట్టారు డా. ఫౌచీ. వైరస్​ వ్యాప్తి మరింత పెరగొచ్చని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రానున్న రోజుల్లో మరింత ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు.

డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్.. కరోనా వ్యాప్తి గురించి భిన్నంగా ఆలోచిస్తారని, ఆయనకు ప్రజల ఆరోగ్యం ముఖ్యమని అన్నారు ఫౌచీ. ట్రంప్​ మాత్రం ఇందుకు భిన్నంగా యోచిస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అధ్యక్ష ఎన్నికల వేళ డా. ఫౌచీ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.