ETV Bharat / international

ట్రంప్​కు ఆ విషయాలు చెప్పబోం: బైడెన్​ - అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

అమెరికా మాజీ అధ్యక్షడు ట్రంప్​నకు దేశ భద్రతా సమాచారాన్ని చెప్పనని కొత్త అధ్యక్షుడు బైడెన్​ అన్నారు. దానివల్ల మరింత ప్రమాదం ఉంటుందని తెలిపారు.

Trump should not receive classified intelligence briefings: Biden
ట్రంప్‌నకు ఆ విషయాలు చెప్పబోం!
author img

By

Published : Feb 6, 2021, 10:48 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలు చెప్పబోమని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలకనున్నట్లు తెలిపారు. ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆయనకు(ట్రంప్​నకు) రహస్య విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. కీలక సమాచారం చెప్పడం వల్ల ఏం లాభం? ఎక్కడైనా నోరుజారి ఏదో వాగడం తప్ప ఆయన వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా?

-బైడెన్, అమెరికా అధ్యక్షుడు​

రహస్య సమాచారమివ్వడం ఆనవాయితీ

మాజీ అధ్యక్షులకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందజేయడం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది. ఇది వారికిచ్చే గౌరవంగా భావిస్తుంటారు. అలాగే వారి అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడొచ్చని అలా చేస్తుంటారు. అయితే, ఇది అధికారంలో ఉన్న అధ్యక్షులకు సమ్మతమైతేనే జరుగుతుంది.

'ఆయనకు చెబితే మరింత ప్రమాదం'

కానీ, ట్రంప్‌నకు తెలియజేయడం వల్ల ఉపయోగమేమీ ఉండకపోగా.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని బైడెన్ భావిస్తున్నారు. గతంలో ట్రంప్‌ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులు సైతం బైడెన్‌కు ఇదే సూచించారు. మాజీ అధ్యక్షులను ప్రత్యర్థి దేశాలు లక్ష్యంగా చేసుకొని కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుందని ట్రంప్‌ హయాంలో జాతీయ భద్రతా విభాగానికి ప్రిన్సిపల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించిన గోర్డన్‌ అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్‌ విషయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. అలాగే అమెరికా ప్రత్యర్థి దేశాల్లోనూ ట్రంప్‌నకు వ్యాపారాలు ఉన్నాయని.. వాటి నుంచి లబ్ధి పొందేందుకు ఆయన సమాచారాన్ని లీక్‌ చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'ప్రపంచాన్ని ఏకం చేసి సైనిక చర్యను తిప్పికొడతాం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.