కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. తమ దేశంలోకి వలసల్ని(ఇమ్మిగ్రేషన్) తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
-
In light of the attack from the Invisible Enemy, as well as the need to protect the jobs of our GREAT American Citizens, I will be signing an Executive Order to temporarily suspend immigration into the United States!
— Donald J. Trump (@realDonaldTrump) April 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">In light of the attack from the Invisible Enemy, as well as the need to protect the jobs of our GREAT American Citizens, I will be signing an Executive Order to temporarily suspend immigration into the United States!
— Donald J. Trump (@realDonaldTrump) April 21, 2020In light of the attack from the Invisible Enemy, as well as the need to protect the jobs of our GREAT American Citizens, I will be signing an Executive Order to temporarily suspend immigration into the United States!
— Donald J. Trump (@realDonaldTrump) April 21, 2020
" ఓ అదృశ్య శక్తి(కరోనా వైరస్) దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం వచ్చింది. అందువల్లే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై నేను సంతకం చేయబోతున్నాను"
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇది కార్యరూపం దాలిస్తే తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు విదేశీయులెవరూ... అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారతీయులు, చైనావాసులే అత్యధికం. అక్కడ పనిచేస్తున్న వారిలోనూ ఈ ఉభయ దేశ వాసులదే సింహభాగం. ట్రంప్ తాజా నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
నిరుద్యోగ భృతి కోసం అమెరికన్లు...
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం అవుతోంది. ఇప్పటి వరకు కరోనాతో 42,500 మందికి పైగా మరణించారు. అలాగే పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 7 లక్షల 92 వేలు దాటింది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు గత కొన్ని రోజులుగా అమలు చేస్తున్న షట్‌డౌన్.. అమెరికా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. అక్కడి అధికారిక లెక్కల ప్రకారం 2.2 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అనేక మంది అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి...