ETV Bharat / international

' అందులో నేనే కింగ్​- లాబీయిస్టులకు బైడెన్​ సేవకుడు' - America elections2020

జో బైడెన్​కు సెప్టెంబర్​లో భారీగా విరాళాలు అందటంపై తీవ్ర విమర్శలు చేశారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. లాబీయిస్టులు, అమెరికా సంపదను దోచుకునే రాబందులకు బైడెన్​ సేవకుడని ఆరోపించారు. విరాళాల సేకరణలో తానే కింగ్​ అని పేర్కొన్నారు. నవంబర్​ 3న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Donald trump
అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్
author img

By

Published : Oct 21, 2020, 12:26 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​పై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. చట్టసభ్యులను ప్రేరేపించే లాబీయిస్టులు, ధనవంతులు కావడానికి అమెరికా సంపదను దోచుకునే 'వాషింగ్టన్​ రాబందుల'కు బైడెన్​ సేవకుడని ఆరోపించారు.

సెప్టెంబర్​లో బైడెన్​కు భారీగా విరాళాలు అందటంపై ఆడిగిన ప్రశ్నకు ఈ మేరకు వ్యాఖ్యానించారు ట్రంప్​. అన్ని రకాల నిధుల సేకరణలో తానే కింగ్​ అని... కానీ తనకు అది అవసరం లేదన్నారు. ఒక్క నెలలో 300-350 మిలియన్​ డాలర్లు విరాళాలు అందటం వెనక ఒప్పందాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. అలా చేయటం తనకు అవసరం లేదన్నారు.

గత సెప్టెంబర్​లో బైడెన్​కు రికార్డు స్థాయిలో 383 మిలియన్​ డాలర్లు విరాళాలు అందాయి. ఆగస్టుతో పోల్చుకుంటే భారీగా పెరిగాయి. ట్రంప్​కు సెప్టెంబర్​లో​ 247.8 మిలియన్​ డాలర్లు మాత్రమే విరాళాలు వచ్చాయి.

భారీ మెజారిటీతో గెలుస్తాం: ట్రంప్​

ఎరీ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. 2016 ఎన్నికల కంటే భారీ ఆధిక్యంతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్​. డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ను ఘోరంగా ఓడించాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. బైడెన్​, కమలా హారీస్​లు గెలిస్తే.. అమెరికాను సోషలిస్ట్​ దేశంగా మార్చేస్తారని ఆరోపించారు.

ఇదీ చూడండి: చైనాలో ట్రంప్​కు వ్యాపారాలు- ట్యాక్స్​ రికార్డుల్లో ఏముంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.