ETV Bharat / international

ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపికకు కారణాలేంటి? - Kamala Harris as the Vice Presidential candidate

కమలా హ్యారిస్​.. భారత్, అమెరికా దేశాల్లో ప్రస్తుతం అధికంగా వినిపిస్తోన్న పేరు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవటమే ఇందుకు కారణం. ఈ ఘనత సాధించిన మొదటి నల్లజాతి మహిళగా రికార్డు సృష్టించారు భారతీయ అమెరికన్​ హ్యారిస్. అయితే ప్రైమరీల్లో ప్రత్యర్థిగా నిలిచిన కమల వైపు అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ ఎందుకు మొగ్గు చూపారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఎంటి? ఇంతకీ ఎవరీ హ్యారిస్​? భారత్​తో సంబంధం ఏంటి?

KAMALA HARRIS
కమలా హ్యారిస్
author img

By

Published : Aug 12, 2020, 4:09 PM IST

కమలా హ్యారిస్.. ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతోంది. కారణం.. అమెరికా అధక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు. ఈ పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్ హ్యారిస్ కావడం విశేషం.

ప్రైమరీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి, తీవ్రంగా విమర్శించిన కమలను ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ ఎలా ఎంపిక చేశారు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? హ్యారిస్ ఎంపికలో మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా పాత్ర ఎంత? ఇంతకీ భారత్​తో కమలా హ్యారిస్​కు ఉన్న సంబంధమేంటి?

ఆసియా- ఆఫ్రికా మూలాలు..

కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్​లో జన్మించారు. బెర్క్​లీలో పెరిగారు. హోవార్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు.

తమిళ మూలాలున్న కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్. ఆమె స్వస్థలం చెన్నై. వృత్తిపరంగా వైద్యురాలైన శ్యామల అమెరికాలో స్థిరపడ్డారు. జమైకాకు చెందిన హ్యారిస్‌ను వివాహం చేసుకున్నారు. కమల విద్యాభ్యాసం అనంతరం న్యాయవాద వృత్తిని చేపట్టి 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా అయ్యారు.

KAMALA HARRIS
కమలా హ్యారిస్

జాతీయ స్థాయి గుర్తింపు..

ఈ పదవి చేపట్టిన తొలి మహిళ (తొలి నల్లజాతీయురాలు కూడా) హ్యారిస్​ కావటం విశేషం. హ్యారిస్​ అటార్నీగా దేశవ్యాప్త గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగి సెనేటర్​గా విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే సెనేట్‌కు ఎంపికయ్యారు. కాంగ్రెస్​లో ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వేగంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు.

ఇప్పుడు ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయిన మూడో మహిళగానూ చరిత్ర సృష్టించారు హ్యారిస్. కమలకు ముందు 2008లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సారా పాలిన్, 1984లో డెమొక్రటిక్ అభ్యర్థిగా గెరాల్డైన్ ఫెరారో పోటీచేశారు. అయితే వీరిద్దరూ విజయం సాధించలేదు. నల్లజాతి మహిళలకు ఇప్పటివరకు రెండు పార్టీలూ అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ టికెట్ ఇవ్వలేదు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా మహిళలు గెలవలేదు.

హ్యారిస్ ఎందుకు?

ఉపాధ్యక్ష అభ్యర్థిగా మహిళను ఎంపిక చేస్తామని ఈ ఏడాది మార్చిలో బైడెన్ ప్రకటించారు. అప్పటినుంచి హ్యారిస్ ఎంపికపై వార్తలు వస్తున్నాయి. అయితే బైడెన్​తో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. ప్రైమరీల్లో ఆయనపై హ్యారిస్ తీవ్రంగా ఆరోపణలు చేశారు. అయినప్పటికీ, అంచనాలను నిజం చేస్తూ కమల అభ్యర్థిత్వాన్ని బైడెన్ మంగళవారం ఖరారు చేశారు.

KAMALA HARRIS
బైడెన్​తో కమలా హ్యారిస్

అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన భారతీయ అమెరికన్లతో పాటు నల్లజాతీయుల ఓటర్లను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్​కు 77 శాతం భారతీయ అమెరికన్ల ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ వీరిపై దృష్టి సారించారు. వ్యాపార, సాంకేతిక రంగాల్లో భారతీయుల కృషిని కీర్తిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, ఈ విషయంలో ట్రంప్​కు చెక్​ పెట్టేందుకు డెమొక్రటిక్ పార్టీ కమలను రంగంలోకి తీసుకొచ్చింది. నల్ల జాతీయుల హక్కుల కోసం కృషి చేసిన అనుభవం హ్యారిస్​కు ఉంది. ఇటీవల జరిగిన జార్జి ఫ్లాయిడ్ నిరసనల్లోనూ హ్యారిస్ కీలకంగా వ్యవహరించారు. ట్రంప్​తో పాటు పోలీసుల చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఫ్లాయిడ్ నిరసనలు..

ఆఫ్రో అమెరికన్​ జార్జి ఫ్లాయిడ్​ మృతిపై దేశమంతా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకాయి. నల్లజాతీయుల పట్ల వివక్షపై దేశంతోపాటు డెమొక్రటిక్ పార్టీలోనూ విస్తృతంగా చర్చ జరిగింది. ఈ పరిణామాలు చారిత్రక ఎంపికకు దారితీశాయి.

ఒబామా సలహా మేరకు..

హ్యారిస్ ఎంపిక వెనుక మరో ప్రధాన కారణం మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా. గత కొన్ని రోజులుగా బైడెన్​కు మద్దతుగా ఒబామా ప్రచారం నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం బైడెన్​ను తన ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఒబామా. బైడెన్​ కూడా తొలుత ప్రైమరీలో ఒబామాకు పోటీగా నిలిచారు. ప్రస్తుతం ఆ లక్షణాలు హ్యారిస్​లోనూ ఉన్నాయని ఒబామా భావించారు.

KAMALA HARRIS
ఒబామా దంపతులతో కమలా హ్యారిస్

"హ్యారిస్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఉపాధ్యక్ష పదవికి మించిన సామర్థ్యం ఆమె​కు ఉంది. మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే అవసరమైనవారి కోసం పోరాడేందుకు తన జీవితాన్నిఅంకితం చేశారు" అని కితాబిచ్చారు ఒబామా.

ఎంపికపై ట్రంప్ విమర్శలు

ఉపాధ్యక్ష పోటీకి కమలను ఎంపిక చేయటంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బైడెన్​ను తీవ్రంగా విమర్శించే వ్యక్తిని తన బృందంలో చేర్చుకున్నారని విమర్శించారు. ప్రైమరీ ఎన్నికల్లో హ్యారిస్ ఘోరంగా విఫలమయ్యారని, అదీ నిశబ్దంగా ఉండే బైడెన్​ చేతిలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. వామపక్ష తీవ్రవాదాన్ని డెమొక్రటిక్ పార్టీ అందిపుచ్చుకుందని, ప్రస్తుతం ఆమె ఎంపిక ఆ పార్టీకి ఎలా పనిచేస్తుందోనని చూడాలన్నారు.

హ్యారిస్ ఎంపిక చారిత్రకం..

  • ప్రముఖ భారతీయ అమెరికన్​, పెప్సికో కంపెనీ మాజీ సారథి ఇంద్రానూయీ.. హ్యారిస్ ఎంపిక భారతీయులు గర్వపడే విషయమని అన్నారు. ఇది గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు.
  • "భారతీయ అమెరికన్ సమాజానికి అమూల్యమైన క్షణాలు ఇవి. జాతీయ స్థాయిలో మన సమాజం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది" అని ప్రవాసీ భారత్ వ్యవస్థాపకులు ఎం.ఆర్. రంగస్వామి అభిప్రాయపడ్డారు.
  • "కమలా హారిస్ కథ.. మారుతున్న అమెరికా గాథ. ఆమె అభ్యర్థిత్వం చారిత్రకం. నల్లజాతీయులకే కాదు లక్షల మంది ఆసియా అమెరికన్ ఓటర్లకు గర్వకారణం" అని ఇంపాక్ట్ అధినేత నీల్ మఖిజా వ్యాఖ్యానించారు.
  • అమెరికాలో కమలం వికసిస్తోందంటూ హ్యారిస్ మద్దతుదారులు దేశవ్యాప్త ప్రచారాన్ని మొదలు పెట్టారు. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ పోస్టర్లతో ఆమెకు మద్దతుగా నిలుస్తామని కాలిఫోర్నియాకు చెందిన వ్యాపారవేత్త అజయ్ భుటోరియా తెలిపారు.

ఇదీ చూడండి: అమెరికా ఉపాధ్యక్ష రేసులో భారత సంతతి కమలా హ్యారిస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.