ETV Bharat / international

వైరస్ టాస్క్​ఫోర్స్​లో భారతీయ టెక్ సీఈఓలు - శంతను నారాయణ్

కరోనాపై పోరులో భారత్​కు సహకరించేందుకు ఏర్పాటైన గ్లోబల్ టాస్క్​ఫోర్స్​లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేరారు. డెలాయిట్ సీఈఓ పునీత్ రెంజెన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్​లు సైతం ఇందులో భాగస్వాములయ్యారు.

sunder-pichai-punit-renjen-and-shantanu-narayen-
భారత్​కు అండగా కార్పొరేట్ దిగ్గజాలు
author img

By

Published : May 7, 2021, 10:48 AM IST

కరోనాపై పోరాటంలో భారత్​కు అండగా నిలిచేందుకు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేసిన గ్లోబల్ టాస్క్​ఫోర్స్​ ఆన్ పాండమిక్ రెస్పాన్స్​లో ముగ్గురు దిగ్గజ సంస్థల సీఈఓలు భాగస్వాములయ్యారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, డెలాయిట్ సీఈఓ పునీత్ రెంజెన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్​లు టాస్క్​ఫోర్స్ స్టీరింగ్ కమిటీలో చేరారు. వీరంతా భారతీయ అమెరికన్లే కావడం విశేషం. ఇప్పటికే వీరంతా భారత్​లో పలు సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

బిల్ & మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్​మన్, బిజినెస్ రౌండ్​టేబుల్ సీఈఓ జోషువా బోల్టెన్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ సుజెన్ క్లార్క్​లు సైతం టాస్క్​ఫోర్స్​లో భాగస్వాములయ్యారు.

ఏంటీ టాస్క్​ఫోర్స్?

అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ టాస్క్​ఫోర్స్​ ఏర్పాటైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఆధారంగా దీన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. బిజినెస్ రౌండ్​టేబుల్ అనే స్వచ్ఛంద సంస్థ దీనికి సహకారం అందిస్తోంది. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్​షిప్ ఫోరంతో కలిసి ఈ టాస్క్​ఫోర్స్ పనిచేస్తోంది. భారత్​లో కరోనా వ్యాప్తిని అడ్డుకునే విధంగా సత్వర చర్యలు చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం.

భారత్​కు 25 వేల ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, వెయ్యి వెంటిలేటర్లు అందించాలని అమెరికా కార్పొరేట్ సంస్థలు నిర్ణయించాయి. ఇందులో డెలాయిట్ పంపిన వెయ్యి ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు ఏప్రిల్ 25న భారత్​కు చేరుకున్నాయి. వీటి రవాణాలో ఫెడ్ఎక్స్ సహకరించింది. 16 వ్యాపార సంస్థలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. ఇవన్నీ కలిసి 30 మిలియన్ డాలర్ల సహాయాన్ని భారత్​కు అందించనున్నాయి.

వీరితో పాటు యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్, అమెజాన్ సీఈఓ ఆండీ జాసీ, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ తదితరులు స్టీరింగ్ కమిటీలో ఉన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ టీకాపై అవగాహన కల్పించే 'భారీ విమానం'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.