ETV Bharat / international

ఈ స్పైడర్​మ్యాన్​ కామిక్​ పేజ్​ ధర రూ.24 కోట్లు!

Spider Man Comics: ఒక కామిక్​ పేజ్ రూ.కోట్లకు అమ్ముడుపోయిందని ఎప్పుడైనా విన్నారా? సూపర్​ హీరోల్లో ప్రత్యేక స్థానం ఉండే స్పైడర్​మ్యాన్​కు అది సాధ్యం అయింది. కేవలం ఒక కామిక్​ ఆర్ట్​ను రూ.24 కోట్లకు పైగా వెచ్చించి మరీ దక్కించుకున్నారు ఓ అభిమాని. ఇంతకీ అందులో ప్రత్యేకత ఏముంది.?

spiderman comics
ఈ స్పైడర్​మ్యాన్​ కామిక్​ పేజ్​ ధర రూ.24 కోట్లు!
author img

By

Published : Jan 14, 2022, 5:32 PM IST

Updated : Jan 14, 2022, 5:46 PM IST

వేలంలో రికార్డ్​ ధర పలికిన స్పైడర్​మ్యాన్​ కామిక్​ పేజ్​

Spider Man Comics: స్పైడర్​మ్యాన్​.. ఈ పాత్రకు ఉండే క్రేజే వేరు. మార్వెల్​ సంస్థ సృష్టించిన ఈ సూపర్​ క్యారెక్టర్​కు పిల్లలు, యువత మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఇటీవల విడుదలైన 'స్పైడర్​ మ్యాన్-​ నో వే హోమ్​' చిత్రానికి కాసుల వర్షం కురిసింది. ఇది ఇక్కడితో ఆగలేదు. తాజాగా అమెరికాలోని డాలస్​లో నిర్వహించిన కామిక్​ బుక్స్​ వేలంలో కూడా స్పైడర్​మ్యాన్​ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

ఒక్క పేజ్​ రూ.24 కోట్లు!

1984 సంవత్సరానికి చెందిన ఓ స్పైడర్​మ్యాన్​ కామిక్​ పేజ్​ వేలంలో రూ. 24.89 కోట్లకు అమ్ముడుపోయింది. పలు స్పైడర్​మ్యాన్​ చిత్రాల్లో కనిపించే బ్లాక్​సూట్​ స్పైడీ పాత్ర ఈ కామిక్​ పేజ్​ ద్వారానే అభిమానులకు పరిచయం అయింది. ఈ సింబయోట్​ సూట్​ నుంచే వెనమ్​ పాత్రను అభివృద్ధి చేశారు రచయితలు. అందుకే ఈ కామిక్​ పేజ్​ అంటే అభిమానులకు అంత క్రేజ్​. రూ. 2 కోట్ల వద్ద ప్రారంభమైన ఈ పేజ్​ వేలం.. రూ.24.89 కోట్ల వరకు వెళ్లింది.

spiderman comics
రూ.24.89 కోట్లకు అమ్ముడుపోయిన స్పైడర్​మ్యాన్​ కామిక్​ పేజ్​

'సూపర్​'మ్యాన్​

మరోవైపు డిటెక్టివ్​ కామిక్స్​ (డీసీ) ఫ్రాంఛైజీకి చెందిన సూపర్​మ్యాన్​ కామిక్స్​లోని ఓ ఎడిషన్​ కూడా స్పైడర్​మ్యాన్​ ధరకు చేరువలోనే అమ్ముడుపోయింది. సూపర్​మ్యాన్​ పాత్రను పరిచయం చేసిన ఎడిషన్​కు సంబంధించిన కాపీనf రూ.23.56 కోట్లకు దక్కించుకున్నారు ఓ అభిమాని.

ఇదీ చూడండి : రన్​వేపై ఎదురెదురుగా విమానాలు.. లక్కీగా క్షణాల ముందే...

Last Updated : Jan 14, 2022, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.