వ్యాపారం లాభాలబాట పడితేనో లేక ఏదైనా కీలక ఒప్పందం జరిగితేనో ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తుంటాయి కంపెనీలు. ఉద్యోగుల నెల జీతం బట్టి కొంత మొత్తాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. కానీ అమెరికాకు చెందిన సారా బ్లేక్లీ (Sara Blakely company) అనే మహిళ మాత్రం ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చారు. ఒక్కో ఉద్యోగికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చేందుకు రెండు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు ఇచ్చారు. అంతేనా.. ఒక్కొక్కరికి రూ. 7.5 లక్షలు బోనస్ ప్రకటించారు.
ఇందుకు సంబంధించి గత వారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను (Sara Blakely instagram) పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ క్షణాలను సెలబ్రేట్ చేసుకునేందుకు నేను మీకు ఈ ఆఫర్ ఇస్తున్నాను. ఇందుకోసం ప్రతి ఉద్యోగికి రెండు చొప్పున ఫస్ట్‌క్లాస్ విమాన టికెట్లు ఇస్తున్నాను. మీరు ట్రిప్‌కు వెళ్తే మంచి డిన్నర్ చేయాలి, మంచి హోటల్లో బస చేయాలి కాబట్టి ఆ ఖర్చుల కోసం కూడా రూ. 7.5 లక్షలు ఇస్తున్నాను. ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని వారి జీవితంలో మరచిపోలేనిదిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.'
-సారా బ్లేక్లీ
సారా ఇచ్చిన ఆఫర్‌కు ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. ఈ టికెట్లు, డబ్బుతో తాము ప్రపంచాన్ని చుట్టేస్తామంటున్నారు.
ఇంతకీ ఈ వరాలు ఎందుకో తెలుసా?.. సారా బ్లేక్లీకి (Sara Blakely story) చెందిన స్పాన్క్స్ కంపెనీ.. బ్లాక్‌స్టోన్ అనే మరో సంస్థతో వ్యాపార ఒప్పందం (Sara Blakely company) కుదుర్చుకోవడం వల్ల. స్పాన్క్స్లో మెజార్టీ వాటాను బ్లాక్‌స్టోన్ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ 1.2 బిలియన్ డాలర్లు (రూ.8.93 వేల కోట్లు).
అందుకే ఆ సంస్థతో ఒప్పందం జరిగిన ఆనందాన్ని సారా ఉద్యోగులతో ఈ విధంగా పంచుకున్నారు.
ఇదీ చూడండి : Sudan Military Coup: సుడాన్లో ఆగని నిరసనలు.. ప్రధాని విడుదల