అమెరికాలోని అలబామాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మోర్గాన్ కౌంటీ ప్రాంతంలోని వాల్హెర్ మోసో స్ర్పింగ్స్‌లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొనేలోపే ఆ ఇల్లు మంటల్లో చిక్కుకుంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చి.. లోపలికు వెళ్లి చూడగా ఏడుగురు చనిపోయి ఉండటాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.
ఇదీ చూడండి: 'చైనా మాకు చాలా చెత్త బహుమతి ఇచ్చింది'