US aid to Ukraine: రష్యా చేస్తున్న దండయాత్రతో ఉక్కరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 13.6 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి తుది అనుమతి లభించింది. ఈ 13.6 బిలియన్ డాలర్లలో దాదాపు సగం ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సైనిక సాయం, తూర్పు ఐరోపా దేశాలకు అమెరికా బలగాలను పంపేందుకు ఖర్చుచేయనున్నారు. మిగిలిన దాంట్లో మానవతాసాయం, ఆర్థిక సాయం సహా రక్షణ బలోపేతం, విద్యుత్, సైబర్ సెక్యూరిటీ అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు.
మరో 50మిలియన్ డాాలర్లు
ఉక్రెయిన్‌కు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం ద్వారా మరో 50 మిలియన్ డాలర్లను మానవతా సాయం కింద అందిస్తున్నట్లు అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రకటించారు.
ఆంక్షలు సడలించిన ఫేస్బుక్
ఉక్రెయిన్‌పై భీకర దాడుల నేపథ్యంలో రష్యాపై వివాదస్పద పోస్టుల నియంత్రణపై ఆంక్షలను సడలించింది ఫేస్బుక్. రష్యాకు వ్యతిరేకంగా చేసే పోస్టుల్లో ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, పౌరులకు, సామాన్య ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు అనుమతించబోమని వెల్లడించింది.
లక్ష మంది..
మరోవైపు ఉక్రెయిన్ నగరాల నుంచి రెండు రోజుల్లోనే లక్ష మంది సురక్షితంగా తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.