ETV Bharat / international

సెనేట్​లో వీగిపోయిన అభిశంసన.. నిర్దోషిగా ట్రంప్

author img

By

Published : Feb 6, 2020, 3:26 AM IST

Updated : Feb 29, 2020, 8:51 AM IST

Television anchor Manish Paul and actor Ellie AvrRam arrived at the set of Shakti Mohan's dance show titled Break a leg! Set to impress the audience with swift moves, the duo is set to feature in an episode of the much-popular dance show.

Senate acquits US President Donald Trump of obstruction of Congress, clearing him of all charges in impeachment trial
సెనేట్​లో వీగిపోయిన అభిశంసన.. నిర్దోషిగా ట్రంప్

03:22 February 06

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసన ప్రక్రియ సెనేట్​లో వీగిపోయింది. అధికార దుర్వినియోగం, చట్టసభలను అడ్డుకునే ప్రయత్నం వంటి అభియోగాలపై​... రెండు వారాల విచారణ అనంతరం ట్రంప్​ను నిర్దోషిగా ప్రకటించింది సెనేట్​.

రిపబ్లికన్ల మెజారిటీ ఉన్న సెనేట్​లో ట్రంప్​ సులువుగా గట్టెక్కారు. అధికార దుర్వినియోగం అభియోగంపై ఓటింగ్​లో 52-48 తేడాతో విజయం సాధించారు. సభను అడ్డుకున్నారన్న అభియోగంపై 53-47 ఓట్ల తేడాతో నిర్దోషిగా తేలారు.

అధికార దుర్వినియోగం అభియోగాలపై రిపబ్లికన్ సెనేటర్ మిట్​ రోమ్నీ మాత్రం ట్రంప్​నకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. మరోవైపు సభను అడ్డుకున్నారన్న కేసులో అధ్యక్షుడికి అనుకూలంగా ఓటు వేశారు.

డెమోక్రాట్ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో డొనాల్డ్ ట్రంప్​పై డిసెంబర్ 18న అభిశంసన ప్రక్రియ చేపట్టింది. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్​పై ఉక్రెయిన్ దర్యాప్తు చేపట్టాలని, ఫలితంగా ఉక్రెయిన్​కు మిలటరీ సహాయం చేస్తానని ట్రంప్​ ఒత్తిడి చేశారని అభియోగాలు మోపింది.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 29, 2020, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.