ETV Bharat / international

'ఐవర్​మెక్టిన్'​తో కరోనా నుంచి రక్ష! - ఐవర్​మెక్టిన్​తో కరోనా కట్టడి

ఐవర్​మెక్టిన్​ ఔషధం కరోనా మహమ్మారిని అంతం చేయగలదని ఓ పరిశోధన వెల్లడించింది. ఐవర్​మెక్టిన్​ను క్రమం తప్పకుండా తీసుకుంటే వైరస్​ బారినపడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. సుమారు 2,500 మందిపై పరీక్షించి ఈ మేరకు తేల్చారు పరిశోధనకులు.

ivermectin
ఐవర్​మెక్టిన్
author img

By

Published : May 10, 2021, 6:25 PM IST

యాంటీపారాసైటిక్​ ఔషధం 'ఐవర్​మెక్టిన్'​ను క్రమం తప్పకుండా తీసుకుంటే.. కొవిడ్​-19 బారినపడే ముప్పు గణనీయంగా తగ్గుతోందని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ ఔషధం కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తమకు లభించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి ఈ మేరకు తేల్చినట్లు పేర్కొన్నారు.

అమెరికన్​ జర్నల్​ థెరపెటిక్స్​ మే-జూన్​ సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. క్లినికల్​, ఇన్​ విట్రో, జంతువులు, ఇతర అధ్యయనాల నుంచి తీసుకున్న డేటాను చాలా సమగ్రంగా సమీక్షించినట్లు రచయితలు తెలిపారు.

"ఐవర్​మెక్టిన్​పై అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్ర విశ్లేషణ చేపట్టాం. అత్యున్నత ప్రమాణాల మేరకు అధ్యయనం సాగించి ఈ ఔషధం కరోనా మహమ్మారిని అంతం చేయగలదని తేల్చాం."

- పియరీ కోరీ, అధ్యయనం చీఫ్​

ఐవర్​మెక్టిన్​ అనేది నోటి ద్వారా ఇచ్చే ఔషధం. పరాన్నజీవుల సంక్రమణ చికిత్స చేసేందుకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ఈ ఔషధం ద్వారా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే.. కొవిడ్ రోగులు త్వరగా కోలుకునేందుకు ఇది సాయం చేస్తున్నట్లు తేల్చారు. సుమారు 2,500 మంది రోగులపై ట్రయల్స్​ నిర్వహించి ఈ మేరకు తేల్చారు. అన్ని అధ్యయనాలు కరోనాను ఐవర్​మెక్టిన్​ నియంత్రిస్తుందని నిరూపించిటన్లు పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొవిడ్​-19 చికిత్సలో ఐవర్​మెక్టిన్​ ప్రభావవంతమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కొవిడ్​కు మరో సమర్థ ఔషధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.