ETV Bharat / international

వేగంగా విస్తరిస్తోన్న కరోనా.. ప్రపంచ దేశాల ఆందోళన

author img

By

Published : Mar 4, 2020, 6:05 AM IST

Updated : Mar 4, 2020, 1:49 PM IST

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కొవిడ్​-19 (కరోనా)పై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్​ను అరికట్టడంలో అలసత్వం కనిపిస్తోందని హెచ్చరించింది. మరోవైపు మార్కెట్​లో మాస్క్​లు, ఇతర వైద్య పరికరాల కొరత ఉందని పేర్కొంది.

Protective gear to fight virus 'rapidly depleting': WHO
వేగంగా విస్తరిస్తోన్న కరోనా.. ప్రపంచ దేశాల ఆందోళన
వేగంగా విస్తరిస్తోన్న కరోనా.. ప్రపంచ దేశాల ఆందోళన

కరోనా (కొవిడ్​-19) వైరస్​ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఈ వ్యాధిని అరికట్టేందుకు అవసరమైన చర్యల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదని డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరించింది. మాస్కులు, గాగుల్స్​ ఇతర వైద్య పరికరాల కొరత మార్కెట్​లో తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

వ్యక్తిగత రక్షణ పరికరాలకు ప్రస్తుతం ఉన్న డిమాండ్​, దుర్వినియోగం కారణంగా.. వైరస్​ వ్యాప్తి చెందిన ప్రపంచ దేశాలకు వాటిని అందించడం కష్టమవుతున్నందుకు మేము చింతిస్తున్నాం.

-టెడ్రోస్​ అధనామ్​, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ జనరల్​

వైద్య సిబ్బందికి రక్షణ కల్పించకుండా కరోనాను అరికట్టడం అసాధ్యమని టెడ్రోస్​ ఉద్ఘాటించారు. ప్రస్తుతం శస్త్ర చికిత్స చేసేందుకు ఉపయోగించే మాస్కుల ధర ఆరురెట్లు పెరగ్గా.. వెంటిలేటర్లకు అయ్యే ఖర్చు మూడు రెట్లు అధికమైనట్లు వివరించారు. ప్రజల భయాందోళనతో వీటిని నిల్వ చేసుకునేందుకు పోటీపడుతున్నారని టెడ్రోస్​ పేర్కొన్నారు. ఇప్పటికే 27 దేశాలకు లక్షల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలను పంపినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

కరోనా వల్ల ప్రతి నెలా 8.9 కోట్ల మాస్క్​లు, 76 మిలియన్ల చేతి గ్లౌజ్​లు, 1.6 మిలియన్ల వరకు గాగుల్స్​ అవసరమవుతాయని డబ్ల్యూహెచ్​ఓ అంచనా వేసింది. ఇప్పటి వరకు వైరస్​ కారణంగా 3,100 మందికిపైగా మరణించారు. సుమారు 77 దేశాల్లో 92 వేలమంది కరోనా బారిన పడ్డారు.

Last Updated : Mar 4, 2020, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.