ETV Bharat / international

మెక్సికోలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి - మెక్సికో భూకంపం

మెక్సికోలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో ఇద్దరు మృత్యువాత పడ్డారు. భవనాలు కూలిపోయి భారీగా ఆస్తినష్టం సంభవించింది. మరోవైపు మెక్సికోకు సునామీ ముప్పు పొంచి ఉందని యూఎస్​ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్​ అడ్మినిస్ట్రేషన్​ హెచ్చరించింది.

Powerful earthquake shakes southern Mexico, at least 2 dead
మెక్సికోలో 7.4 తీవ్రతతో భూకంపం.. ఇద్దరు మృతి
author img

By

Published : Jun 24, 2020, 4:40 AM IST

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ ప్రకృతి విపత్తుకు చిక్కి ఇద్దరు వ్యక్తులు మరణించగా, భవనాలు కూలిపోయి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

హువాతుల్కో వద్ద సంభవించిన ఈ భూకంపంతో దక్షిణ, సెంట్రల్ మెక్సికోలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీశారు. 26 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని... దాని ప్రభావం 12 కి.మీ మేర కనిపించిందని అమెరికా భూకంప హెచ్చరికల కేంద్రం తెలిపింది.

భూకంపం సంభవించిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

సునామీ ముప్పు

యూఎస్​ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్​ అడ్మినిస్ట్రేషన్​... మెక్సికో తీరానికి సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అలలు సుమారు 3 నుంచి 10 అడుగుల ఎత్తున ఎగసిపడే అవకాశముందని అంచనా వేసింది. అలాగే మధ్య అమెరికా, పెరూ, ఈక్వెడార్​ల్లోనూ ఓ మోస్తరు స్థాయిలో అలలు చెలరేగుతాయని వెల్లడించింది. టెక్టానిక్ ప్లేట్స్​లో కదలికలే ఇందుకు కారణమని పేర్కొంది.

గ్వాటెమాల జాతీయ విపత్తు సంస్థ కూడా దక్షిణ పసిఫిక్ తీరానికి సునామీ హెచ్చరిక చేసింది. ప్రజలు సముద్ర తీరం నుంచి దూరంగా ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి: చైనా వెన్నుపోటు- నేపాల్​ భూభాగం దురాక్రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.