అమెరికా వాటికన్ సిటిలోని రోమన్ క్యాథలిన్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్‌కు ఆదివారం అనుకోని ఘటన ఎదురైంది. సంప్రదాయ వారంతపు ప్రార్థనకు సెయింట్ పీటర్స్ భవనానికి వెళ్లిన క్రమంలో లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఆయన లిఫ్టులో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవటం వల్ల దాదాపు 25 నిమిషాల పాటు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పోప్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
తదనంతరం తన కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఆలస్యానికి గల కారణాన్ని వివరించారు పోప్. ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరారు. తనని కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:భాజపా ఎంపీపై దాడికి నిరసనగా 12 గంటల బంద్