అమెరికా, ఉత్తర కరోలీనా నగరంలో దారుణం జరిగింది. చార్లొట్టే, బియట్టీస్ ఫోర్డ్లో నడిరోడ్డుపై కాల్పులకు తెగబడ్డారు కొంతమంది దుండగులు . ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి తూటాలు తాకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాల్పులకు తెగబడ్డ తర్వాత దుండగులు.. మరికొందరిని వాహనాలతో ఢీకొని గాయపరిచారని పోలీస్ ఉన్నతాధికారి.. జెన్నింగ్స్ తెలిపారు. ఓ పాదచారి సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వందలాదిమంది.. వీధుల్లో పరుగులు తీస్తూ కనిపించారని ఆయన పేర్కొన్నారు.
అయితే, రోడ్డుపై వెళ్తున్న అమాయకులపై కాల్పులు జరిపింది ఎవరన్నది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:ట్రంప్ ప్రచార శంఖారావం- ఫస్ట్ షో ఫ్లాప్!