ETV Bharat / international

అమెరికాలో రణం: ఓట్ల లెక్కింపుపై కొనసాగుతున్న నిరసనలు - America Elections protest news updates

శ్వేతసౌధం ఎన్నికల పోరులో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ నిరసన సెగతో అట్టుడుకుతోంది అమెరికా. ఓవైపు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు 'అక్రమ ఓట్ల కౌంటింగ్​ ఆపండి' అంటూ ఆందోళన చేయగా... మరోవైపు ట్రంప్ వ్యతిరేకవాదులు 'ప్రతి ఓటు లెక్కించండి' అని అగ్రరాజ్యం వీధుల్లో భారీగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.

Phoenix protesters chant 'stop the illegal vote'
'అక్రమ ఓట్లు కౌంటింగ్​ ఆపండి'.. కాదు 'ప్రతి ఓటు లెక్కించండి'
author img

By

Published : Nov 6, 2020, 7:48 PM IST

అమెరికాలో ఓట్లు లెక్కింపుపై కొనసాగుతున్న నిరసనలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. 'అక్రమ ఓట్ల లెక్కింపు ఆపండి' అంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు పలు రాష్ట్రాల్లో ఆందోళనకు దిగారు. మరోవైపు 'ప్రతి ఓటు లెక్కించండి' అని బైడెన్​ వర్గీయులు నిరసనల జోరు పెంచారు. ఓట్ల లెక్కింపులో మోసాలు జరుగుతున్నాయంటూ రిపబ్లికన్​ పార్టీ వేసిన వ్యాజ్యాలను.. కోర్టు కొట్టివేయడం వల్ల నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి.

Phoenix protesters chant 'stop the illegal vote'
అమెరికాలో కొనసాగుతున్న నిరసనలు

ఇరువర్గాల మధ్య వాగ్వాదం

కౌంటింగ్ కేంద్రాల చుట్టూ కంచె..

ఆరిజోనా సహా కౌంటింగ్​ కొనసాగుతున్న పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు ఆందోళనకారులు. పలు చోట్ల ఎన్నికల కేంద్రాలను చుట్టుముట్టారు. ఫలితంగా ఎన్నికల సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించకుండా.. భవనాల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు అధికారులు.

భారీ సంఖ్యలో ర్యాలీలు నిర్వహించిన ఇరు వర్గాలు

నిరసనలు హింసాత్మకంగా మారకుండా భద్రతా సిబ్బంది గస్తీ

ఆందోళకారుల చేతుల్లో తుపాకులు

ఆరిజోనాలోని ఫీనిక్స్‌ నగరంలోనూ ట్రంప్ అనుకూల వర్గం ర్యాలీ నిర్వహించింది. రిపబ్లికన్ల కంచుకోటగా ఉన్న ఆరిజోనా రాష్ట్రంలో.. బైడెన్‌ గెలవడం వల్ల ఆందోళనలు చెలరేగాయి. ఫీనిక్స్​ నగరంలోని ఎన్నికల కేంద్రాల వద్ద గుమిగూడిన కొంత మంది ట్రంప్​ మద్దతుదారులు తుపాకులతో కనిపించారు. ఫీనిక్స్, డెట్రాయిట్​, ఫిలడెల్ఫియాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రంప్ మద్దతుదారులు అధిక సంఖ్యలో సమావేశమయ్యారు. లాస్​వేగాస్​లోనూ ఓట్ల లెక్కింపు కేంద్రాల ఎదుట ఆందోళనలు చేశారు. 'మోసాలు ఆపండి. ఓట్లను దోచుకోవద్దు' అంటూ నినాదాలు చేశారు.

నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులు

సహనం పాటించాలి

మరోవైపు ఫిలడెల్ఫియాలో బైడెన్​ అనుకూల వర్గాలు ఆందోళనకు దిగాయి. 'ప్రతి ఓటును లెక్కించండి, ఓట్లను ట్రంప్ దోచుకోకుండా చేయాలి' అని నినాదాలు చేశారు. ఈక్రమంలో ప్రజలు సహనం పాటించాలని పిలుపునిచ్చారు మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​.

Phoenix protesters chant 'stop the illegal vote'బైడెన్​ అనుకూలవాదుల నిరసన

ఇదీ చూడండి: ట్రంప్xబైడెన్: అమెరికాలో నిరసనల హోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.