అమెరికా సంస్థ ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగ ఫలితాలను ప్రకటించింది. మూడో దశ ట్రయల్స్ తుది విశ్లేషణలో 95 శాతానికిపైగా ప్రభావవంతంగా తమ వ్యాక్సిన్ పనిచేసిందని ఫైజర్‌తో పాటు దాని భాగస్వామి బయోఎన్‌టెక్ వెల్లడించాయి.
"మా కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ మూడో దశ ట్రయల్స్‌లో అన్ని ప్రాథమిక సామర్థ్య అంశాలను నెరవేర్చింది. 170 మంది వైరస్ సోకిన వ్యక్తులపై ప్రయోగించిన బీఎన్టీ162బీ2 క్యాండిడేట్.. మొదటి డోసు తర్వాత 28 రోజులకు 95 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించింది."
- ఫైజర్ ప్రకటన