ఇరాక్, అఫ్గానిస్థాన్‌లోని తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు కొత్త ప్రణాళికను రూపొందించింది అమెరికా. ఇందుకు సంబంధించిన వివరాలను అగ్రరాజ్యంలో కొత్తగా నియమితులైన రక్షణ కార్యదర్శి క్రిస్టఫర్ మిల్లర్ వెల్లడించారు. ఈ ప్రణాళికతో అఫ్గానిస్థాన్‌లోని 4,500 బలగాలు 2,500కు, ఇరాక్‌లోని 3వేల బలగాలు 2,500కు తగ్గుతాయని పేర్కొన్నారు.
అమెరికా, తన మిత్రదేశాలు సురక్షితంగా ఉన్నప్పుడు బలగాలను ఉపసంహరించుకుంటామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞకు ఈ సరికొత్త ప్రణాళిక దోహదపడుతుందని తేలిపారు మిల్లర్. ఈ ప్రక్రియకు కమాండర్లు, సలహాదారులు అంగీకరించినట్టు స్పష్టం చేశారు.
అయితే అనేకమంది నిపుణులు, మిలిటరీ అధికారులు.. బలగాల ఉపసంహరణలో ఇంత వేగం పనికిరాదని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్.. వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు 5రోజుల ముందే ఈ బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుండటం గమనార్హం.
ఇదీ చూడండి:- సోమాలియాలో ఉగ్రదాడి- ఐదుగురు మృతి