అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ శుక్రవారం బహిరంగంగా కరోనా టీకా వేయించుకున్నారు. ఉపాధ్యక్ష అధికార భవనంలో ఆయనకు వైద్యులు వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో వ్యాక్సిన్ అందుకున్న ప్రపంచ నేతల్లో మొదటివాడిగా పెన్స్ నిలిచారు. పెన్స్ టీకా తీసుకుంటున్న దృశ్యాలను అమెరికా మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది.
పెన్స్తోపాటు ఆయన సతీమణి కారెన్, సర్జియన్ జనరల్ జెరోమ్ ఆదమ్స్ సైతం టీకాను వేయించుకున్నారు. తాను కూడా వచ్చేవారం కరోనా వ్యాక్సిన్ను తీసుకోనున్నట్లు స్పీకర్ నాన్సీ పెలోసి తెలిపారు.
ఇదీ చదవండి : శీతాకాలంలో కరోనా ఉగ్రరూపం!