ట్రంప్ అభిశంసనపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ స్పీకర్, డెమొక్రాట్ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ. ఉక్రెయిన్ వ్యవహారంలో ట్రంప్ గీత దాటారని పేర్కొన్నారు.
డెమొక్రాట్ సభ్యులు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో గత నెలలోనే ట్రంప్‌పై అభిశంసన తీర్మానం నెగ్గింది. అయితే ప్రస్తుతం రిపబ్లికన్ అభ్యర్థులు మెజారిటీగా ఉన్న సెనేట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ సభలో నెగ్గితేనే ట్రంప్ పదవీచ్యుతుడవుతారు. ఈ నేపథ్యంలో ఓ టీవి ఛానెల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఉక్రెయిన్ వ్యవహారంలో అధ్యక్షుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు పెలోసీ.
" అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన పెట్టాల్సింది కాదు. అయితే రాజ్యాంగ నిబంధనలను విస్మరించి ప్రవర్తించడం కారణంగా ఇది తప్పడం లేదు."
-నాన్సీ పెలోసీ, అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ స్పీకర్
త్వరలో అభిశంసనకు సంబంధించిన పత్రాలను సెనేట్‌కు పంపనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు పెలోసీ. అభిశంసన పత్రాలను సెనేట్‌కు పంపడంలో ఆలస్యం చేయడంపై సమర్థించుకున్నారు.
ఇదీ చూడండి: 'చర్చలకు రండి'.. హ్యారీకి ఎలిజబెత్ రాణి ఆదేశం