ETV Bharat / international

శాంతి ఒప్పందమే అఫ్గాన్​ పాలిట శాపమా? - Uday Bhaskar

ఏళ్లుగా రక్తపుటేర్లు పారిన నేలపై శాంతి కుసుమాలు వికసించనున్నాయా? నిత్యం తుపాకీ కాల్పులు, బాంబుల మోతలు, ఆత్మాహుతి దాడులు, మారణహోమంతో విసుగెత్తిపోయి.. ప్రశాంతత కోసం ఆశగా ఎదురుచూస్తున్న అఫ్గానిస్థాన్‌ వాసులు ఇక శాంతి పవనాలను ఆస్వాదించవచ్చా? అంటే అదంత సులభం కాదంటున్నారు నిపుణులు. అయితే అమెరికా మాత్రం తాలిబన్లపై నమ్మకంతో అఫ్గాన్​ను తన చేతిలో పెట్టేసి వెళ్తోంది. అగ్రరాజ్యం నిర్ణయంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలపై ఈటీవీ భారత్​ సైన్యం మాజీ అధికారి ఉదయ్​ భాస్కర్​తో చర్చించింది.

us-and-taliban
అఫ్గాన్​లో బలగాల ఉపసంహరణకు అమెరికా సిగ్నల్​... హైటెన్షన్ తప్పదా!
author img

By

Published : May 16, 2020, 6:48 PM IST

రక్తపుటేర్లు పారిన అఫ్గాన్​ నేలపై శాంతి స్థాపనకు నడుం బిగించింది అమెరికా. రెండు దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని మరచి తాలిబన్లతో చేసుకున్న శాంతి ఒప్పందంలో భాగంగా... అఫ్గానిస్థాన్​లోని తమ బలగాలను ఉపసంహరించుకుంటోంది. జులై 15 నాటికి దాదాపు 8,600 దళాలను వెనక్కి తీసుకెళ్లిపోవడమే కాకుండా 5 ఆర్మీ స్థావరాలను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది అగ్రరాజ్యం.

మరి తాలిబన్లకు అఫ్గాన్​ను అప్పగిస్తే మరిన్ని దాడులు పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే... ఆ దేశంలో శాంతి సహా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న భారత్​ లక్ష్యం నీరుగారినట్లే. ప్రస్తుతం అమెరికా చేపట్టిన విధానాల వల్ల అఫ్గాన్​కు నష్టమేంటి? భారత్​ ఎలాంటి విధివిధానాలతో ముందుకెళ్లాలి? వంటి అంశాలను ఆర్మీ మాజీ అధికారి ఉదయ్​ భాస్కర్.. ఈటీవీ భారత్​కు​ వివరించారు.

ఈటీవీ భారత్​ ముఖాముఖి

చివరిలో వదిలేస్తోందా..?

9/11 దాడి తర్వాత అమెరికా బలగాలు తాలిబన్లపై పోరు మొదలుపెట్టాయి. దాదాపు 20 ఏళ్లుగా వారితో పోరాడుతున్నాయి. ప్రస్తుతం వారి ప్రభావం చాలా వరకు తగ్గించేశాయి. ఇక పూర్తిగా అంతమైపోతుందనే సమయంలో ట్రంప్​... శాంతి ఒప్పందం చేసుకుని బలగాలను ఉపసంహరించుకుంటున్నారు. తాలిబన్ల చేతుల్లోకి అఫ్గానిస్థాన్​లో వెళితే పరిస్థితులు మారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ... దోహా ఒప్పందం జరిగాక ఇటీవలె కాబుల్​లో మరణమృదంగం మోగించాయి తాలిబన్​కు చెందిన కొన్ని ఉగ్రమూకలు. బాంబులతో దాడులకు పాల్పడి పసిబిడ్డల సహా 20 మంది ప్రాణాలను బలిగొన్నాయి. అయితే అమెరికా బలగాలు ఉండగానే విధ్వంసం ఇలా ఉంటే.. భవిష్యత్తులో కచ్చితంగా పరిస్థితులు మారిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇలా దోహా ఒప్పందం...

ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉండి.. పరస్పరం భీకరదాడులు జరుపుకొన్న అమెరికా, తాలిబన్‌... ఖతార్​లోని దోహా వేదికగా చేయి చేయి కలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 29న చారిత్రక శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టాయి. తాలిబన్‌ తరఫున ముల్లా బరాదర్‌, అమెరికా పక్షాన ఆ దేశ ముఖ్య చర్చల ప్రతినిధి ఖలీజాద్‌ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. అల్‌ ఖైదాతో సంబంధాలు తెంచేసుకుంటామన్న తాలిబన్​ హామీ తర్వాతే ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్​, పాకిస్థాన్‌, టర్కీ, ఇండోనేసియా, చైనా తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

శాంతి ఒప్పందం కింద..

- అన్ని షరతులకూ తాలిబన్‌ కట్టుబడితే 14 నెలల్లో అమెరికా, దాని మిత్రపక్షాల బలగాలు అఫ్గాన్‌ నుంచి పూర్తిగా వైదొలుగుతాయి.

- ఒప్పందం కుదిరిన 135 రోజుల్లో అక్కడున్న మొత్తం 13 వేల మంది సైనికుల్లో 8600 మందిని అమెరికా వెనక్కి తీసుకుంటుంది. అదే నిష్పత్తిలో అమెరికా మిత్ర పక్షాలు కూడా తమ బలగాలను నాలుగు నెలల్లోగా ఉపసంహరించుకుంటాయి.

- అంతిమంగా అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సైనికులు, దౌత్యేతర పౌర సిబ్బంది, ప్రైవేటు భద్రతా కాంట్రాక్టర్లు, శిక్షకులు, సలహాదారులు, సైన్యానికి తోడ్పాటు అందించే విభాగాల వారినీ వెనక్కి తీసుకుంటాయి.

- తమ వద్ద బందీలుగా ఉన్న వారిని అమెరికా, తాలిబన్లు పరస్పరం మార్పిడి చేసుకుంటాయి. 5వేల మంది తాలిబన్‌ ఖైదీలు, అఫ్గాన్‌ సైన్యానికి చెందిన వెయ్యి మంది విడుదలవుతారు. అప్పటికల్లా అఫ్గాన్‌ ప్రభుత్వానికి, తాలిబన్‌కు మధ్య చర్చలు మొదలవుతాయి.

ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే దాన్ని వెంటనే రద్దు చేసుకోవటానికి వెనుకాడబోమని, షరతులకు కట్టుబడితేనే తమ బలగాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది అమెరికా. అయితే శాంతి ఒప్పందంపై అఫ్గాన్‌ ప్రభుత్వ వైఖరి అస్పష్టంగా కనపించింది. ఎందుకంటే అమెరికా-తాలిబన్‌ చర్చల్లో అఫ్గాన్‌ సర్కారుకు పాత్ర కల్పించలేదు. అయితే ఆ తర్వాత ఒప్పదం జరగడాన్ని బాహాటంగా ప్రశంసించిన అఫ్గాన్​ ప్రభుత్వం.. తమ చెరలో ఉన్న కొందరు తాలిబన్​ ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకరించింది.

అమెరికా ఏమంటోంది..?

అఫ్గాన్​లో పూర్తి స్తాయి బలగాలు ఉపసంహరించుకోకుండా.. కొన్ని దళాలు సహా నిఘా​ వర్గాలు నిరంతరం అఫ్గాన్​లో ఉండి పరిస్థితులను పరిశీలిస్తాయని అమెరికా చెప్తోంది. అవి.. అల్​ఖైదా, ఇస్లామిక్​ స్టేట్​పై ఓ కన్నేసి ఉంచుతాయని అంటోంది.

ఇదంతా వ్యూహంలో భాగమేనా..??

దోహా ఒప్పందం తర్వాత తాలిబన్లు దాడికి పాల్పడటాన్ని ఖండించింది అమెరికా. అంతటితో ఆగకుండా తాలిబన్​ అత్యున్నత స్థాయి నాయకుడిని మట్టుబెట్టింది. వాళ్ల స్థావరాలపైనా దాడి చేసింది. ఇదంతా ట్రంప్​ వ్యూహంలో భాగమని కొందరు అనుమానిస్తున్నారు. దాక్కున్న తాలిబన్లను బయటకు రప్పించేందుకే అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. గతంలో బలగాలను రప్పిస్తానన్న ట్రంప్​ హామీ నెరవేర్చుకోవడంలో ఇదొక ఎత్తుగా అభివర్ణిస్తున్నారు.

భారత్​- పాక్​ పాత్ర కీలకం...

అఫ్గాన్​ రాజకీయాల్లో తటస్థంగా వ్యవహరిస్తూ.. అక్కడ అభివృద్ధిలో పాలుపంచుకుంటోంది భారత్​. రోడ్లు, స్కూళ్లు, పార్లమెంటు భవనాలు సహా వారికి ఆర్థికంగా మద్దతిస్తోంది. మళ్లీ తాలిబన్ల ఆధిపత్యం పెరిగితే భారత్​ అందించిన సేవలు వృథా అయిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా, అఫ్గాన్​తో చర్చలు జరిపి భారత్​ కీలకంగా వ్యవహరించాలని కోరుతున్నారు నిపుణులు. మరోవైపు పాక్​ కూడా తాలిబన్లతో మాట్లడి సమస్యలు రాకుండా చూడాల్సిందేనని చెప్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.