ETV Bharat / international

కరోనాతో సీన్​ రివర్స్- ట్రంప్ క్యాంప్​లో కలవరం! - ప్రచారం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. రిపబ్లికన్​లలో ఆందోళన పెరుగుతోంది. ఓవైపు ప్రత్యర్థి వర్గం కదనరంగంలో దూసుకెళ్తోంది. తమవైపు నాయకుడు మంచానపడ్డాడు. భయపడాల్సిందేమీ లేదని చెప్పి.. తానే మహమ్మారిబారిన పడటంపై ప్రజలేమో గుర్రుగా ఉన్నారు. మానసిన ఆందోళన వైట్​హౌస్​ ముందే తిష్టవేసింది. తమ పోరాట వీరుడు వచ్చేదెప్పుడు... అపనిందల ముద్రలను చెరిపేసుకుని విజయతీరాలకు చేరేదెపుడు.. రిపబ్లికన్లందరిదీ ఇదే బెంగ ఇప్పుడు.

Trump campaign
ప్రచారానికి నెల రోజులే సమయం.. ట్రంప్ క్యాంపులో కలవరం ?
author img

By

Published : Oct 5, 2020, 4:06 PM IST

ఇన్నాళ్లూ ప్రపంచదేశాలను మాటలతోనే గడగడలాడించిన డొనాల్డ్ ట్రంప్ పరిస్థితేం బాగోలేదిప్పుడు. అసలే ప్రత్యర్థి ప్రశ్నల వర్షంలో.. తన మాటల తూటాలు​ తడిచిపోయి పనిచేయని పరిస్థితి. సంవాదంలో గుక్కతిప్పుకోకుండా గెలిచేద్దామని భావించి.. చివరకు తానే దిక్కులు చూసిన సందర్భం. ఈ నేపథ్యంలో గెలుపు మార్గం అన్వేషణలో భాగంగా.. అస్త్రాలు పదును పెడదామంటే ఆస్పత్రిలోంచే అన్నీ ఆపరేట్ చేయాల్సిన తరుణం. ఇక ఈ పరిస్థితుల్లో ప్రచార పర్వంలో పరిగెత్తేదెలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు ట్రంప్​ అస్మదీయులు.

కరోనా తెచ్చిన కలవరం..

ట్రంప్​ ప్రపంచదేశాలపై ఊహకందని విధంగా విధించే ఆంక్షలలాగే... ఆహ్వానించని అతిథిలా ఊహించనిరీతిలో శ్వేతసౌధాన్ని బంధించేసింది కరోనా. పరిస్థితులు బాగాలేవు.. ఈ సమయంలో పార్టీలు వద్దంటూ అధికారులు మొత్తుకున్నా.. అధ్యక్షుడు వినలేదనే విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఏదైతేనేం, అధ్యక్షుడితో పాటు.. ఆయన సతీమణి కుడా కరోనా పాజిటివ్ అనిపించేసుకున్నారు. కొన్ని నెలలుగా.. ట్రంపా లేదా బైడెనా, ఎవరు కావాలో తేల్చుకోండి అన్నవిధంగా ఇరుపార్టీలు ప్రజలకే అల్టిమేటం ఇస్తున్నాయి. ఇది కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి రెఫరెండంగా చెబుతూ ముందుకెళ్దామని భావించినా.. వాతావరణం వేగంగా మారిపోయింది. ముఖ్యంగా రిపబ్లికన్లలో ఉక్కపోత కనిపిస్తోంది.

ట్రంప్ గుడారంలో గుబులు

వీటన్నిటికంటే ముందు ట్రంప్ గుడారంలో గుబులు రేపింది. మొదటి సంవాదంలో అధ్యక్షుడి మౌనం, దేశంలో పెరుగుతున్న హింస... ముఖ్యంగా శ్వేతజాతీయులు అణిచివేత ధోరణి గురించి ప్రత్యర్థి ప్రశ్నిస్తే... కనీసం పట్టనట్లు వ్యవహరించటం, ఆ అంశంపై నోరు పెకలకపోవటం అందరిలో అనుమానంతో కూడిన ఆశ్చర్యం కలిగించింది. అంతేనా, అప్పటికే.. ట్రంప్​ కట్టిన పన్నుల చిట్టా సంపాదించిన డెమొక్రాట్లు ప్రచారంలో దంచేస్తున్నారు. ప్రజలకు వివరాలు పంచేస్తున్నారు. ఇక నష్టనివారణ చేపట్టాల్సిన పరిస్థితుల్లో.. అధ్యక్షుల వారు మిన్నకుండిపోయారు. దీంతో తమ ప్రచార నావ నట్టేట మునిగినట్లేనని గగ్గోలు పెడుతున్నారు రిపబ్లికన్లు.

మరో నెలరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ప్రచారం మంచి రసపట్టులో ఉంది. ఈ దశలో అధ్యక్షుడు ట్రంప్‌ కొవిడ్‌ బారిన పడటం వల్ల ఎన్నికలు, ఆయన ఆరోగ్య పరిస్థితి, అనంతర పరిణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వృద్ధాప్యంలో కరోనా సోకడం ప్రమాదకరమేనని ప్రపంచవ్యాప్తంగా అనేక ఉదంతాలు చెబుతున్నాయి. 74 ఏళ్ల ట్రంప్‌ ఇంట్లోనే ఉంటూ పూర్తిగా కోలుకున్నా.. చురుగ్గా ఉండగలుగుతారా ? ప్రచారంలో పాల్గొంటారా ? ప్రత్యర్థిని పడగొట్టేలా నిలబడతారా ? పార్టీని నిలబెడతారా ? నిర్లిప్తంగా ఉన్న ఏ రిపబ్లికన్​ను కదలించినా వినిపించే మాటలివే.

ప్రచారం పరిస్థితేంటి ?

ఈ పరిస్థితుల్లో ట్రంప్​ మరోసారి వైట్​హౌస్​లో దర్జాగా తిరిగేందుకు సర్వస్వం దారబోస్తున్న ప్రచార నిర్వాహకులు ఇక తమపై ముప్పేట దాడి జరిగినట్లే అన్న భావనలో ఉన్నారు. వీరి వాదనను కాదనలేని కారణాలున్నాయి మరి. 'ట్రంప్​ ఉన్నారు. అన్నీ చూసుకుంటారు' అని ఇన్నాళ్లుగా ఉన్న ధీమా సంగతి అటుంచితే... ప్రస్తుతం అసలేం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నడిపించే నాయకుడికే వైరస్​ సోకింది. ఇప్పుడెలా ? అని ఆలోచించేలోపే ఆ బృందంలో మరో ముగ్గురూ బాధితులేనని తేలింది. సిసలు సమరానికి నెలరోజులు కూడా లేదు. దూసుకుపోతున్న ప్రత్యర్థి ప్రవాహానికి అడ్డుకట్టవేసే మార్గం కనిపించటంలేదు. ప్రచార బృందంలో బలవంతులు.. కరోనా బాధితులుగా మారారు. నిందలు, ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. మరోవైపు ప్రచారానికి నిధులు భారీగా సమకూరిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ట్రంప్​ క్యాంపెయిన్​ కష్టాల కడలిలో పడింది.

Trump
ప్రచారానికి నెల కూడా లేని సమయం

'ఆపరేషన్​ మాగా' మాటేంటి ?

ట్రంప్​ వర్గం కాస్త అప్రమత్తమైంది. శ్రేణుల్లో జోష్​ నింపేందుకు.. 'ఆపరేషన్​ మాగా' పేరుతో పాత అస్త్రాన్నే కొత్త హంగులతో ముందుకు తీసుకొచ్చింది. ఆస్పత్రి నుంచే ట్రంప్ ఈ కార్యక్రమానికి సమరశంఖం పూరించినట్లుగా చెబుతున్నారు​ ట్రంప్​ వీరాభిమానులు.

ట్రంప్‌కు కరోనా సోకడం వల్ల ఈ నెల 15న ప్రత్యర్థి బైడెన్‌తో జరగాల్సిన చర్చా కార్యక్రమం అనిశ్చితిలో పడింది. అయితే వైరస్‌ సోకడాన్ని కూడా ట్రంప్‌ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చని.. అంతా మన మంచికేనని భావిస్తున్నారు మరికొంతమంది. త్వరగా కోలుకుంటే ‘చూశారా? దీనికి భయపడాల్సిన పనిలేదని చెప్పానా?’ అంటూ ప్రచారం హోరెత్తించవచ్చని, ఒక వేళ తీవ్ర అనారోగ్యం బారిన పడి కోలుకుంటే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లా సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్నారు.

మైక్​ పెన్స్ పాట్లు..

ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్.. అధినేత లేకపోయినా పోరాటం ఉద్ధృతంగానే చేస్తున్నారు. ట్రంప్​ కుటుంబాన్ని వెంటేసుకుని, రిప్లబ్లికన్ల కుంటుంబంతో అమెరికా అంతా కలసిరావాలని పిలుపునిస్తూ కలియదిరుగుతున్నారు.

ట్రంప్​ అనారోగ్యం వల్ల ఇప్పటికే రిపబ్లికన్ల ప్రచార యజ్ఞం... భగ్నం అయింది. ఉన్నది తక్కువ సమయం, ప్రత్యర్థికంటే తక్కువగా ఆర్థిక వనరులు.. పైగా ఎక్కువ ఆరోపణలు, అపనిందలు, అసంతృప్తి.. వీటిన్నిటినీ సమర్థంగా సమన్వయం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకోవటం కత్తిమీద సామే. మరి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అవుతున్న ట్రంప్​.. ఫీనిక్స్​ పక్షిలా దూసుకొస్తారామో వేచి చూడాలి.

ఇదీ చుడండి: ట్రంప్​కు మాస్కు ధరించాలని చెప్పిన కరోనా..!

ఇదీ చుడండి: అధ్యక్ష ఎన్నికలు: ముందస్తు పోలింగ్​ అంటే?

ఇదీ చుడండి: 'బైడెన్​కే ప్రవాసీల మద్దతు- గుజరాతీలు మాత్రం...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.