ETV Bharat / international

ఒబామా రీఎంట్రీ- ట్రంప్​పై 'అయోమయం' పంచ్​ - రీఎంట్రీ

కరోనా మహమ్మారి కట్టడిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీరును తీవ్రంగా తప్పుబట్టారు మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా. ట్రంప్​.. వైరస్​ను ఎదుర్కొన్న తీరును 'గందరగోళ విపత్తు'గా అభివర్ణించారు. ప్రస్తుత సంక్షోభంపై ప్రపంచదేశాలన్నీ పేలవంగా స్పందిస్తున్నాయని విమర్శించారు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో.. ఒబామా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Obama calls Trump's COVID-19 response 'absolute chaotic disaster'
ఒబామా రీఎంట్రీ.. ట్రంప్​పై తీవ్రస్థాయిలో విమర్శలు
author img

By

Published : May 10, 2020, 12:09 PM IST

కొవిడ్‌-19పై పోరులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విఫలమయ్యారని విమర్శిస్తున్న వారి జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సైతం చేరారు. మహమ్మారి కట్టడిలో ట్రంప్‌ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు తన హయాంలో పనిచేసిన సిబ్బందితో శుక్రవారం ఒబామా మాట్లాడిన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది.

ట్రంప్‌ తొలి జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ ఫ్లిన్‌పై వచ్చిన ఆరోపణల్ని ఎత్తివేయడంపైనా ఒబామా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒబామా తిరిగి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బిడెన్​కు మద్దతు....

కొవిడ్‌-19ను ట్రంప్‌ ఎదుర్కొన్న తీరును 'గందరగోళ విపత్తు'గా ఒబామా‌‌ అభివర్ణించారు. 'ఒబామా అలమ్నీ అసోసియేషన్‌'లోని 3 వేల మంది సభ్యులతో మాట్లాడిన ఆయన డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

''స్వార్థం, ఆటవికత, విభజన, ఇతరుల పట్ల శత్రుత్వ భావం వంటి పోకడలు ప్రస్తుతం అమెరికావాసుల జీవితాల్లో భాగమయ్యాయి. అంతర్జాతీయంగానూ ఇదే తీరు కొనసాగుతోంది. ఈ పరిణామాల వల్లే తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చాలా పేలవంగా స్పందిస్తున్నాయి.''

- బరాక్​ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

గందరగోళం...

మెరుగైన ప్రభుత్వాలకు సైతం ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్న అంశమని అభిప్రాయపడ్డారు ఒబామా. ఇలాంటి తరుణంలో 'నాకేంటి అన్న ధోరణితో సాగుతూ.. అందరితో కయ్యాలు పెట్టుకుంటున్న' పాలకవర్గం ఉండడం విపత్తును మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు.

గతంలో ట్రంప్‌ అనేకసార్లు ఒబామా పాలనపై విమర్శలు గుప్పించారు. కానీ, ఒబామా మాత్రం ఏనాడూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. తాజా రాజకీయాలపై వ్యాఖ్యానించిన సందర్భాలూ అరుదే. కానీ, ఇప్పుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించడం.. బిడెన్‌కు మద్దతు పలకడం వంటి పరిణామాలు చూస్తుంటే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జో బిడెన్‌ను గెలిపించడం కోసం తాను కావాల్సినంత సమయాన్ని వెచ్చిస్తానని ఒబామా తన మద్దతుదారులకు హామీ ఇవ్వడం కొసమెరుపు. ట్రంప్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఒబామాను కావాలనే డెమొక్రాట్లు రంగంలోకి దింపారనే వాదన వినిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.