రష్యా హ్యాకర్ల సైబర్ దాడికి గురైన తమ దేశ ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల సంఖ్య మరింత పెరిగేలా ఉందని అమెరికా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధినేత విలియం ఇవానియా తెలిపారు. దర్యాప్తు చేసే కొద్ది ఈ విషయాలు బయటపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా హ్యాకర్ల బారిన పడిన కంపెనీల సంఖ్య పెరిగేలా ఉంది. ఈ సైబర్ దాడిలో మాకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. దర్యాప్తు చేసే కొద్ది బాధిత సంస్థలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హ్యాకర్లు తమ కంప్యూటర్లలో చొరబడ్డారని తెలిసినా.. 10 ప్రభుత్వ కంపెనీలు రాజీపడ్డాయి. హ్యాకింగ్ పెద్ద మొత్తంలో జరిగి ఉంటుందని భావిస్తున్నాం. అమెరికా భద్రతను దెబ్బతీసేలా సమాచారాన్ని సేకరించడానికి హ్యాకర్లకు కావాల్సిన సమయం దొరికింది. దాదాపు 18000 సంస్థలు సైబర్ బారిన పడ్డాయని అంచనా.
విలియం ఇవానియా, కౌంటర్ ఇంటెలిజన్స్ చీఫ్
అమెరికాలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలపై రష్యా హ్యాకర్లే సైబర్ దాడి జరిపారని యూఎస్ జాతీయ నిఘా విభాగం (ఎఫ్బీఐ) గత కొద్ది నెలలుగా ఆరోపిస్తోంది. సమాచారం కోసం ట్రెజరీ, వాణిజ్యం తదితర పలు శాఖల వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడి జరిపారని ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి:అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు!