ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికల వేళ న్యూయార్క్​ అప్రమత్తం - అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యమవుతాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్​ ప్రజలు అప్రమత్తమయ్యారు. నగర వీధుల్లో అద్దాలతో ఉన్న లగ్జరీ కార్యాలయాలు, దుకాణాలకు రక్షణ కవచాలుగా కర్రచెక్కలను అడ్డుపెట్టుకుంటున్నారు. నిరసనలు, గొడవలు జరిగే అవకాశముందన్న వార్తలతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు.

NewYork alerts as rumors increase on delay of US Presidential Election results
అధ్యక్ష ఎన్నికల వేళ న్యూయార్క్​ అప్రమత్తం
author img

By

Published : Nov 3, 2020, 7:40 PM IST

దేశ 46వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకే అమెరికా సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు పది కోట్ల మంది ఓటర్లు ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం నాడు భారీ సంఖ్యలో ఓటర్లు హాజరయ్యే పరిస్థితి ఉండటం, ఎన్నికల ఫలితాలు ఆలస్యమయ్యే ఆస్కారం ఉందన్న వార్తల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా, ఓటింగ్‌, ఫలితాలు ఆలస్యమైతే నిరసనలు, గొడవలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో న్యూయార్క్‌ అధికార యంత్రాంగం అలర్ట్‌గా ఉంది.

NewYork alerts as rumors increase on delay of US Presidential Election results
చెక్కతో రక్షణ

అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. న్యూయార్క్‌లోని మన్‌హటన్ వీధితోపాటు నగరం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమయ్యింది. అక్కడ అద్దాలతో ఉన్న లగ్జరీ కార్యాలయాలు, దుకాణాలకు రక్షణ కవచాలుగా కర్రచెక్కలను అడ్డుపెట్టుకుంటున్నారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన అనంతరం జరిగిన నిరసనలు తీవ్రరూపమైన ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.

ఇలా ఏర్పాట్లు

ఇదీ చూడండి:- ట్రంప్ ​X బైడెన్​: గెలిచేదెవరో తేలేది కోర్టులోనే!

అప్రమత్తమైన న్యూయార్క్‌..

ఎన్నికల వేళ లేదా ఫలితాల సమయంలో నిరసనలు, గొడవలు జరిగే అవకాశముందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో తాజా పరిస్థితులపై పోలీసులతో చర్చించారు. అయితే, గొడవలు జరుగుతాయని ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు రాలేదని పోలీసులు స్పష్టంచేశారు. ఎన్నికల ఫలితాలపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోన్న మాట వాస్తవమేనని.. కానీ, అంతగా భయపడాల్సిన అవసరం లేదని మేయర్ తెలిపారు. అయితే, ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దుకాణాదారులు చేసుకుంటున్న జాగ్రత్తలపై మీడియా ప్రశ్నించగా..అది వారి అభీష్టం మేరకేనని, వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని మేయర్‌ వెల్లడించారు. ఫలితాలు మాత్రం మంగళవారం రాత్రి కానీ, బుధవారం వచ్చే అవకాశాలు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాల అనంతరం నిరసనలు తెలిపితే తప్పులేదని.. కానీ, అవి శాంతియుత వాతావరణంలోనే చేస్తే బాగుంటుందన్నారు.

అద్దాలకు 'కవర్​'

ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌ నగరంలో ఉన్న లగ్జరీ దుకాణాలకు చెక్కలతో ఇలా రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి:- బైడెన్ 'అగ్రరాజ్య అధినేత' కల సాకారమయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.