అమెరికాలో ఓ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఫ్లోరిడా నుంచి బయలుదేరిన టీ-6బీ టెక్సాన్2 అనే శిక్షణ విమానం అలబామాలోని ఫోలే పట్టణ ప్రాంతంలో కుప్పకూలింది. ఆ వెంటనే మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సమీప ప్రాంతానికి మంటలు వ్యాపించి ఒక ఇల్లు, కొన్ని కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి జో డార్బీ తెలిపారు.
ఈ ఘటనలో మరణించిన వారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. విమానం కుప్పకూలిన ప్రాంతంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కమాండర్ జాక్ హర్రెల్ తెలిపారు.