తన తల్లి పని చేసిన ప్రయోగశాలలోని సామగ్రిని శుభ్రం చేయడమే తన తొలి ఉద్యోగంగా భావిస్తానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చెప్పారు. కొవిడ్-19 టీకా రెండో డోసు కోసం అక్కడి జాతీయ ఆరోగ్య కేంద్రం(ఎన్ఐహెచ్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు కమల. గతేడాది డిసెంబర్ 29న కరోనా టీకా తొలి డోసును తీసుకున్నారు కమలా.
"మా బాల్యంలో మా అమ్మ ఎక్కడికి వెళ్లేవారో మాకు బాగా తెలుసు. మేమిప్పుడు కాలిఫోర్నియాలో నివసిస్తున్నాం. అప్పుడు ఆమె బెథెడ్సా అనే ప్రదేశానికి వెళ్లేవారు. అక్కడి జాతీయ ఆరోగ్య కేంద్రంలో బయోలాజికల్ ఎండోక్రినాలజీ విభాగంలో పనిచేసేవారు. మా ఇద్దరు(తన సోదరిని కలుపుకుని) చూస్కోవడం, రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు అమ్మ. పాఠశాల ముగిసిన తర్వాత.. వారంతాల్లో తన ల్యాబోరేటరీకి తీసుకెళ్లేవారు. నాకు బాగా గుర్తుంది అక్కడి ప్రయోగశాలలో పెప్పెట్(రసాయనిక పరికరం)లను శుభ్రపచరడమే నా తొలి ఉద్యోగం."
- కమలా హారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలు
రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలైన కమలా హారిస్ తల్లి శ్యామల గోపాలన్ 2009లో క్యాన్సర్ బారినపడి మృతిచెందారు. తండ్రి జమైకా అమెరికన్ డొనాల్డ్ హారిస్.. అర్థశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎన్ఐహెచ్ సిబ్బందిని ప్రశంసించారు హారిస్. సమయాన్ని పట్టించుకోకుండా నిరంతరం పనిచేస్తూ.. సేవకే అంకితం అయి ఉంటారని కొనియాడారు.
ఇదీ చదవండి: ప్రమాణస్వీకార వీక్షణల్లో జో బైడెన్ రికార్డ్